Cough Syrups : డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ‘దగ్గు సిరప్’.. కేంద్రం కీలక నిర్ణయం..!
సాక్షి లైఫ్ : ఇకపై మెడికల్ షాపునకు వెళ్లి నేరుగా దగ్గు సిరప్ (Cough Syrup) కొనుగోలు చేయడం కుదరదు. దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యుల సిఫార్సు (Prescription) లేకుండా వీటిని విక్రయించడాన్ని నిషేధిస్తూ నిబంధనలను సవరించింది. షెడ్యూల్-K (Schedule K) జాబితా నుంచి దగ్గు సిరప్‌లకు ఉన్న మినహాయింపును కేంద్రం తొలగించింది. అయితే, దగ్గుకు సంబంధించిన టాబ్లెట్లు, మాత్రలు, లోజెంజెస్ (Lozenges) వంటివి యథాతథంగా ప్రిస్క్రిప్షన్ లేకుండానే లభిస్తాయని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో కలుషిత దగ్గు సిరప్‌ల వల్ల దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని విషాద సంఘటనల నేపథ్యంలో డ్రగ్ కన్సల్టేటివ్ కమిటీ (DCC) సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
నిబంధనలు మార్చడానికి ప్రధాన కారణాలు..
మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా జిల్లాతో పాటు రాజస్థాన్, మరికొన్ని ప్రాంతాల్లో కలుషిత దగ్గు సిరప్‌లు తాగి చిన్న పిల్లలు మరణించిన సంఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తించాయి.దగ్గు సిరప్‌ల తయారీలో వాడే ప్రొపిలిన్ గ్లైకాల్ వంటి పదార్థాలలో ఇథిలీన్ గ్లైకాల్, డైఇథిలీన్ గ్లైకాల్ వంటి హానికరమైన కలుషితాలు చేరుతున్నట్లు నిపుణుల కమిటీ గుర్తించింది.
వ్యసనంగా మారే ప్రమాదం..
కోడైన్ (Codeine) వంటి ఓపియాయిడ్లు ఉండే కొన్ని రకాల దగ్గు సిరప్‌లను చాలామంది దుర్వినియోగం చేస్తూ వ్యసనంగా మార్చుకుంటున్నారు. ఇకపై ఇలాంటి వాటికి కూడా డాక్టర్ చిట్టీ తప్పనిసరి.
చిన్నారుల ప్రాణాలకు ముప్పు..
చిన్న పిల్లలకు ఇవ్వకూడని డెక్స్ట్రోమెథోర్ఫాన్ (Dextromethorphan) వంటి కాంబినేషన్లను తల్లిదండ్రులు అవగాహన లేక కొనుగోలు చేసి ఇస్తున్నారు. దీనివల్ల 4 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లల్లో తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు (Respiratory depression), మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు హెచ్చరించారు. చిన్నపాటి దగ్గు, జలుబు రాగానే సొంత వైద్యంతో సిరప్‌లు వాడటం పిల్లల ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సిరప్‌ల దుర్వినియోగం తగ్గడమే కాకుండా చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ చేకూరుతుందని వైద్య వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
