అల్లం రసం ఇలా అప్లై చేస్తే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..
సాక్షి లైఫ్ : చాలామంది హెయిర్ ఫాల్ సమస్య ను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు సరైన పరిష్కారం అందిస్తుంది అల్లం రసం. అందుకోసం ముందుగా ఆలివ్ నూనె తీసుకుని అందులో అల్లం రసం కలపాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేసి రాత్రంతా అలానే ఉంచి పొద్దున్నే తలస్నానం చేయాలి. ఇలా కొద్దిరోజులపాటు చేస్తే జుట్టు మెరిసి పోవడమేకాకుండా హెయిర్ ఫాల్ సమస్య అనేది రాదు. పొడి జుట్టుకి అల్లం రసాన్ని అప్లై చేసి గంటపాటు అలానే ఉంచి, ఆ తర్వాత షాంపూ గానీ కండీషనర్‌తో శుభ్రం చేసుకోవాలి.
అల్లం రసాన్ని జుట్టుకి వాడడం వల్ల ఆరోగ్యవంతమైన, పొడవైన జుట్టును మీరు మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఇలా చేయడం వల్ల జుట్టుకి మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. జుట్టు ఒత్తుగా పెరుగడంతోపాటు, ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గస్తుంది. కాబట్టి, జుట్టుకి అల్లాన్ని రెగ్యులర్‌గా అప్లై చేయడం ఉత్తమం. అల్లం రసం తలపై దురద , చిన్న చిన్న పొక్కులు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పొక్కులను తగ్గిస్తాయి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
