Dengue Mosquitoes : డెంగీకి కారణమయ్యే దోమలు ఎక్కువగా ఎప్పుడు కుడతాయంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలం తర్వాత ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా తదితర వ్యాధులు విపరీతంగా ప్రబలుతుంటాయి. ఈ నేపథ్యంలో డెంగీని వ్యాప్తి చేసే దోమల లక్షణాలు, నివారణ చర్యలపై కనీస అవగాహన కలిగి ఉండటం అత్యవసరం.

దోమలు కుట్టే సమయం..

డెంగీకి కారణమయ్యే 'ఏడిస్ ఈజిప్టి' (Aedes aegypti) దోమలు పగటిపూట, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అత్యంత చురుకుగా ఉంటాయి. రాత్రి వేళల్లో మాత్రమే కుట్టే మలేరియా దోమలతో పోలిస్తే ఇవి కాస్త భిన్నం. అయితే, ఇవి కేవలం పగలు మాత్రమే కాకుండా రాత్రి పూట కూడా కుట్టే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

ఎక్కడ వృద్ధి చెందుతాయి..?

ఈ దోమలు మనుషుల చుట్టుపక్కల ఉండే వాతావరణంలోనే ఎక్కువగా పెరుగుతాయి. ఇళ్లు, పరిసర ప్రాంతాల్లోని పూలకుండీలు, కూలర్లు, పాత టైర్లు, నీళ్ల ట్యాంకులు, జంతువులకు నీరు పెట్టే పాత్రల్లో కొద్దిరోజుల పాటు నిల్వ ఉండే నీటిలో ఇవి గుడ్లు పెట్టి వేగంగా వృద్ధి చెందుతాయి.

ప్రధాన లక్షణాలు.. 

తీవ్రమైన జ్వరం, భరించలేని తలనొప్పి, కీళ్లు,కండరాల నొప్పులు. కళ్ల వెనుక భాగంలో నొప్పి, వికారం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు రావడం. వ్యాధి తీవ్రత పెరిగితే శరీరంలో అంతర్గత రక్తస్రావం జరగడం, రక్తపోటు అమాంతం పడిపోవడం (Low blood pressure) లాంటి సమస్యలు తలెత్తి ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఉదయం, సాయంత్రం వేళల్లో శరీరాన్ని పూర్తిగా కప్పేలా వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. చర్మానికి దోమల నివారణ లేపనాలను (mosquito repellent lotions) రాసుకోవాలి. ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలు, తలుపులకు మెష్ (mesh)లను ఏర్పాటు చేసుకోవాలి. నిద్రపోయేటప్పుడు తప్పనిసరిగా దోమతెరలు వాడాలి. ఇంటి చుట్టుపక్కల ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. డెంగీ సీజన్‌లో ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.