తినే గమ్‌తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
సాక్షి లైఫ్ : వింటర్ సీజన్ లో ఈ బంకను తీసుకోవడం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. అందుకే దీన్ని "వింటర్ ఎనర్జీ బూస్టర్" అని కూడా అంటారు. తినే గమ్ ను "గోండ్", "గోధుమ బంక" అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. దీన్ని స్వీట్లు, పానీయాలు, రుచికరమైన వంటకాలు తయారీలో కూడా ఉపయోగిస్తారు.
యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కీళ్ల సంబంధిత సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆర్థరైటిస్‌కు కూడా ఇది సరైన నివారిణి. ఇందులో రెసిన్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తినే గమ్ జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది
-ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
-శ్వాసకోశ సమస్యలకు చెక్కుపడుతుంది. పైగా దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడంలో మంచి నివారిణిగా కూడా ఉంటుంది.
-బాలింతలకు మంచి శక్తినిచ్చే ఔషధంగా పనిచేస్తుంది.
-రక్త ప్రసరణను మెరుగపరిచి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.
-ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మంచి పోషాకాహారంగా భావిస్తారు.
-గోండ్ నువ్వుల లడ్డులు, గోండ్ కీ ఖీర్, గోండ్ డ్రై ఫ్రూట్ పరాటా,గోండ్ కీ రాబ్, గోండ్ లడూ,గోండ్ చిక్కి వంటి వంటకాలు తయారు చేస్తారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
