PCOS effect : పీఎంఓఎస్.. సంతానలేమి సమస్య మాత్రమే కాదు..! మెటబాలిక్ ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పాలిఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PMOS) అనగానే కేవలం క్రమం తప్పిన నెలసరి, హార్మోన్ల అసమతుల్యత లేదా సంతానలేమి సమస్యగానే చాలామంది భావిస్తుంటారు. కానీ దీని ప్రభావం కేవలం పునరుత్పత్తి వ్యవస్థకే పరిమితం కాదని, మహిళల పూర్తి జీవక్రియ(metabolic health) ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పాథాలజిస్ట్ నిపుణులు చెబుతున్నారు. పీఎంఓఎస్ వల్ల కలిగే ముప్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మెటబాలిక్ ఆరోగ్యంపై ప్రభావం ఎలాగంటే..? 

పీఎంఓఎస్ కారణంగా శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే కణాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించకపోవడం పెరుగుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి శరీరానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది. దీర్ఘకాలంలో ఇది గ్లూకోజ్ జీవక్రియను దెబ్బతీసి మధుమేహానికి దారితీసే ప్రమాదం ఉంటుంది.దీనివల్ల శరీరంలో లిపిడ్ ప్రొఫైల్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు విపరీతంగా పేరుకుపోతుంది. ఇవన్నీ భవిష్యత్తులో హృద్రోగ ముప్పును పెంచుతాయి.

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?

 

వ్యాధి నిర్ధారణలో ఈ పరీక్షలు కీలకం..

పీఎంఓఎస్ లక్షణాలు కనిపించిన వెంటనే కేవలం హార్మోన్లు, పునరుత్పత్తి సంబంధిత పరీక్షలు చేయించుకుంటే సరిపోదు. అంతర్జాతీయ పీఎంఓఎస్ మార్గదర్శకాల ప్రకారం, ఈ సమస్య ఉన్న మహిళల్లో వయసు, బీఎంఐ (BMI)లతో సంబంధం లేకుండా గుండె జబ్బుల ముప్పును అంచనా వేయాలి. వైద్యుల సలహా మేరకు బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్ తదితర మెటబాలిక్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.

నెలసరి సమస్యలే ఆరంభ సంకేతాలు..

చాలామంది మహిళలు నెలసరి క్రమం తప్పినప్పుడు లేదా గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే వైద్యులను సంప్రదిస్తుంటారు. ఈ అవకాశాన్ని కేవలం సంతానలేమి చికిత్సకే పరిమితం చేయకుండా, మెటబాలిక్ ప్రమాద కారకాలను గుర్తించడానికి కూడా వినియోగించుకోవాలి. బయటకు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోయినా, ఈ పరీక్షల ద్వారా భవిష్యత్తులో వచ్చే ముప్పును ముందుగానే పసిగట్టవచ్చు.

గర్భధారణ సమయానికే పరిమితం చేయొద్దు..

కేవలం పిల్లల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మాత్రమే పీఎంఓఎస్ గురించి ఆందోళన చెందడం సరైన విధానం కాదు. పీఎంఓఎస్ అనేది దీర్ఘకాలం పాటు వేధించే సమస్య. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు, వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం అత్యంత ఆవశ్యకం.

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..కాలేయం దెబ్బతింటుందని సూచించే సంకేతాలు ఇవే..

ఇది కూడా చదవండి..హెపటైటిస్ ఏ సమస్య వర్షాకాలంలోనే పెరగడానికి కారణాలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.