ఇదిగో.. వింటర్ ఎనర్జీ బూస్టర్..
సాక్షి లైఫ్ : వింటర్ ఎనర్జీ బూస్టర్..దీనినే "తినే గమ్" అంటారు. "తినే గమ్" అంటే కొత్తగా అనిపించినా కానీ ఇది మాత్రం పాతదే.. ఎందుకంటే ఈ తినే గమ్ ను ఆయుర్వేదంలో ఉంపయోగించే ఓ ఔషధం. తినే గమ్ ను "గోండ్" అని "గోధుమ బంక" అని కూడా అంటారు. ఇది చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. జిగురులాంటి ఈ ప్రత్యేకమైన పదార్థంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అసలు తినదగిన గమ్ అంటే..ఏంటి..?
తినదగిన గమ్.. ఇది జిగురు లా ఉండే ఓ ప్రత్యేకమైన పదార్థం.ఆయుర్వేద చికిత్సలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. స్థానికంగా గోధుమ బంక అని, బాదాం బంక అని కూడా అంటారు. సాధారణంగా మార్కెట్లలో అయితే గోండ్ కటిరా లేదా ట్రగాకాంత్ గమ్ అనే పేర్లతో అందుబాటులో ఉంటుంది.
గ్రీకు భాషలో ట్రాగోస్ అంటే మేక, అలాగే అకాంత అంటే కొమ్ము అని అర్థం. ఈ రెండు పదాల కలయికతో "ట్రగాకాంత్ గమ్" అని పిలుస్తారు. ఇది అకాసియా చెట్ల వేర్ల నుంచి తీసే సహజ సిద్ధమైన జిగట వంటి పదార్ధం. దీనికి ఎలాంటి వాసన, రుచి అంటూ ఏమి ఉండదు. ఈ బంకను నీటిలో వేస్తే కరిగి జెల్లీలాగా సాఫ్ట్ గా మారుతుంది. ఈ గమ్ ను స్వీట్లు, పలురకాల డ్రింక్స్ తోపాటు, రుచికరమైన వంటకాలు తయారీలో కూడా వినియోగిస్తారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
