ఏం చేస్తే.. మధుమేహం అదుపులో ఉంటుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఇటీవల కాలంలో మధుమేహ సమస్య చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. 40, 50 ఏళ్ళు పైబడిన వారు మాత్రమేకాకుండా చిన్నవయస్సులోనే కొందరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. షుగర్ విషయంలో రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండవు. దీని కారణంగా రోగికి అనేక ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. షుగర్ ను అదుపులో ఉంచుకోవాలంటే తీపి పదార్థాలు తినడం మానుకోవాలి. అదేవిధంగా అవసరమైన మందులు వాడాలి. పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా చక్కెర స్థాయిలు అదుపులో ఉండడం లేదని కొందరు ఫిర్యాదు చేస్తుంటారు. ఇది కొన్ని తప్పుల వల్ల జరుగుతుంది. ఆయా జాగ్రత్తలు పాటించినప్పటికీ మధుమేహం ఎందుకు నియంత్రణలో ఉండదు. అందుకు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సమయానికి భోజనం.. 

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోగికి ఉదయం భోజనం చాలా ముఖ్యమైనది. రోజు రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా రోగి తీసుకునే అల్పాహారంపై ఆధారపడి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు నిద్రలేచిన గంటలోపు ఏదైనా తినాలి. 

అంతే కాకుండా లంచ్, డిన్నర్ సమయానికి తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్లు భోజనంతో సంబంధం లేకుండా ఏదైనా ఆరోగ్యకరమైన తినాలి. భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఉండడం వల్ల మధుమేహం పెరుగుతుందని గుర్తుంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సమయానికి..   

షుగర్ ఉన్నవాళ్లు అందుకు సంబంధించిన మందులను సమయానికి తీసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో ఔషధాన్ని తీసుకోవాలి. అంతే కాకుండా ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకునే వారు డాక్టర్ సూచించిన సమయానికి తప్పనిసరిగా తీసుకోవాలి. 

ఖచ్చితంగా ఎక్సర్ సైజ్.. 

డయాబెటిక్ ఉన్నవాళ్లు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.. ఎక్సర్ సైజ్  చేయడం వల్ల శరీరరంలో కేలరీస్ ఖర్చవుతాయి. దీని కారణంగా శరీరంలోని షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. వీలైనంత వరకు వ్యాయామం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎక్కవ సేపు వ్యాయామం చేయలేకపోయినా రోజుకి కానీసం 30నిమిషాల పాటు నడవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. కలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారో తెలుసా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.