కలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారో తెలుసా..?
సాక్షి లైఫ్ : భూమిపై మనిషి మూడింట ఒక వంతు సమయం నిద్రతోనే గడుపుతున్నాం. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే నిద్ర మెరుగుపడుతుంది. కానీ పడుకునే ముందు కఠోరమైన వ్యాయామం చేసినా నిద్రపట్టకపోవచ్చు. ప్రస్తుతం కలర్ టెలివిజన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిద్రలేమి సమస్యలు మరింతగా పెరిగాయి. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఆయా సమస్యలు ఇంకొంచెం పెరిగాయి.
కలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని "ఒనిరియాలజీ " అంటారు. నిద్రలో కలలు వచ్చేస్థితిని ఇంగ్లీష్ లో "రాపిడ్ ఐ మూవ్ మెంట్" అని అంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కనుగుడ్లు వేగంగా కదులుతూ ఉంటాయి. కాబట్టే కలలను "రాపిడ్ ఐ మూవ్ మెంట్" గా వ్యవహరిస్తారు. డీప్ స్లీప్ దశలోనే మనిషి కలలు కనడం జరుగుతుంది. సాధారణంగా తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయంటారు. కలలు ఎక్కువగా తెల్లవారు జామునే వస్తాయి.
కొందరికి అర్థరాత్రి..
నిద్రావస్థ చరమ దశ తెల్లవారుజాము కాబట్టి ప్రయత్నిస్తే ఆ సమయం లోని కలలను గుర్తు పెట్టుకొన గలిగే అవకాశం వుంది. కొందరికి అర్థరాత్రి 2నుంచి 3 గంటల సమయంలో మెలకువ వస్తే ఇక నిద్ర పట్టదు. అయినా కళ్లు మూసుకొని పడుకొనటం వల్ల మెదడు, కళ్లు సేద దీరుతాయి.
కళ్లు మూసుకొని..
మెలకువ వున్నప్పటికీ కళ్లు మూసుకొని పడుకొంటే మెదడు చేతనావస్థలో వుండి కూడ నిద్ర ఫలితం కొంతమేర దక్కుతుంది. నిద్రపట్టలేదు, మెలకువ గానే ఉన్నామను కొన్నప్పటికీ ఆ సమయంలో కూడా వచ్చిన కలలను గమనించేందుకు వీలుకలుగుతుంది.
సృజనాత్మకత..
నిద్రలో కలలు రావడం సాధారణమైన విషయం, అంత మాత్రాన నిద్ర సరిగ్గా పట్టడంలేదని ఆందోళన చెందనవసరం లేదు. సృజనాత్మకత ఎక్కువగా ఉన్నవారికి సహజంగా కలలు ఎక్కువగా వస్తాయి. భయం పుట్టే కలలు వచ్చినపుడు మాత్రం గుండె కొట్టుకునే, ఊపిరి పీల్చే వేగంలో మార్పులు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇలాంటప్పుడు మెలకువ రావొచ్చు. సాధారణంగా తెల్లవారు జామున ముందు రోజు చేసిన పనుల తాలూకూ ఆలోచనలకు సంబంధించిన కలలే ఎక్కువగా వస్తాయి.
అధ్యయనాలు..
కల ఎప్పుడో యాదృచ్ఛికంగా నిజం కావొచ్చు తప్పవేకువన వచ్చే కలలు నిజమవుతాయనేది కేవలం అపోహ మాత్రమే అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కలలు ఎక్కువగా వేధిస్తున్నపుడు పగటిపూట సంతోషకరమైన అంశాలపైన దృష్టి పెట్టాలి. కలలకు అంత ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర విషయాలమీదనే దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
భావోద్వేగాల అనుభూతులే..
నిద్రలోని కొన్ని దశల్లో భాగంగా మనస్సులో అసంకల్పితంగా సంభవించే ఆలోచనలు, భావోద్వేగాల అనుభూతులే కలలు. అంతేగానీ అటువంటి వాటిని ఆధారంగా చేసుకొని ఇలా అయితే మంచి జరుగుతుందని, అలా అయితే చేదు జరుగుతుందని నిర్ధారించలేమని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. అల్లోపతికి, యునాని వైద్యానికి లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
