ఉల్లిపాయ పొట్టుతో ఏమేం చేయవచ్చు..?  

షేర్ చేయండి:
ఉల్లిపాయ పొట్టుతో ఏమేం చేయవచ్చు..?  

సాక్షి లైఫ్ : ఉల్లిపొట్టును అనేకరకాలుగా వినియోగించవచ్చు. టోనర్‌గా, కంపోస్ట్‌గా, టీ, హెయిర్ డై, ఫ్లేవర్ ఏజెంట్‌గానేకాకుండా పలువిధాలుగా రకాలుగా ఉల్లిపొట్టు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ పొట్టును రెండు సార్లు క్లీన్ గా కడగాలి. ఆతర్వాత ఎండలో కొద్దిసేపు ఆరబెట్టి పొడిచేయాలి. ఆరునెలలపాటు నిల్వ ఉండే ఈ  పొడి మసాలాలో కలుపుకుని కూరల్లో వేసుకుంటే..కూర మంచి రుచిగా ఉంటుంది.

తేనీరు.. 

ఉల్లిపాయ పొట్టు తో చేసిన టీ తాగడం వల్ల చర్మం హెల్తీ గా ఉంటుందట. ఉల్లిపొట్టును నీటిలో 10 నుంచి 20 నిమిషాల వరకు ఉడకబెట్టాలి. ఆ మిశ్రమాన్ని వడపోసిన "టీ"లా తాగవచ్చు.  ఈ "టీ" తాగితే అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాదు హై బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్లు సోకకుండా చేస్తుంది. 

టేస్ట్,స్మెల్..  

స్టాక్, సూప్, గ్రేవీ మరుగుతున్న సమయంలో ఉల్లిపాయ పొట్టును జోడించడం ద్వారా మంచి రుచితోపాటు శక్తివంతమైన రంగును అందిస్తుంది. గ్రేవీని చిక్కగా మారుస్తుంది. ఉడకబెట్టిన తర్వాత పీల్స్ తొలగించడం మర్చిపోవద్దు.

చర్మం రోగాలకు.. 

ఉల్లిపాయ తొక్కలు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండి చర్మం, దద్దుర్లు, అథ్లెట్స్ ఫుట్‌పై దురదను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మంపై ఉల్లిపాయ తొక్క నీటిని అప్లై చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు.

జుట్టు పెరుగుదలకు.. 

ఉల్లిపాయ పొట్టులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది నెరిసిన జుట్టు రంగు మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు పోషణ అందించడం ద్వారా జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది.

ఉల్లిపాయ పొట్టును నల్లగా కాల్చి మెత్తగా నూరాలి. దీనికి కొంచెం  కలబందను కలపాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని హెయిర్ డైలా అప్లై చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

హెయిర్ టోనర్..

పొడి జుట్టు, నిస్తేజమైన జుట్టు కోసం ఉల్లిపాయ తొక్కలను హెయిర్ టోనర్‌గా వాడుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలను నీళ్లలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించడం ద్వారా ఈ టోనర్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని సీసాలో నిల్వ చేసుకుని అప్పుడప్పుడు జుట్టుకు పట్టించాలి.

ఉల్లిపాయ పొట్టులో ఉండే ఎల్-ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సహజమైన మత్తుమందులా పనిచేస్తుంది. ఉల్లిపాయ పొట్టు తో చేసిన "టీ" తాగడం వల్ల నరాలు ప్రశాంతతను పొందుతాయి. మంచిగా నిద్ర పడుతుంది.

కంపోస్ట్‌ గా..

 ఉల్లిపొట్టు కంపోస్ట్‌ గా ఉపయోపడుతుంది. ఇంట్లో పెంచుకునే మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే పోషకాలు ఇందులో ఉన్నాయి. ఉల్లిపాయ పొట్టులో మొక్కలకు బలాన్నిచ్చే  ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి. ఇవన్నీ పూల మొక్కలకు మంచి టానిక్‌లా పనిచేస్తాయి.  

నేచురల్ కలర్ గా..  
 
ఉల్లిపాయ పొట్టును నీటిలో ఉడకబెట్టి ఆ కలర్ ను నేచురల్ కలర్స్ గా వినియోగిస్తారు. ఉల్లి రకాన్ని బట్టి బంగారు-పసుపు,డార్క్‌ ఆరెంజ్‌ రంగు వస్తుంది. హస్తకళాకారులు, చేతివృత్తులవాళ్లు ఈ సహజ రంగును వివిధ ఫాబ్రిక్ ,పేపర్ కోసం వినియోగిస్తారు.

కేర్ ఫుల్ గా ఉండాలి: ఉల్లిపాయ పొట్టు ను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే దీనికరణంగా కొంతమందికి అలెర్జీలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి గమనించగలరు.

ఇది కూడా చదవండి.. అల్లం రసం ఇలా అప్లై చేస్తే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.