Miscarriages : పదేపదే గర్భస్రావం అవ్వడానికి థైరాయిడ్ ముప్పే కారణమా..?
సాక్షి లైఫ్ : మాతృత్వం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక మధుర స్వప్నం. అయితే, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ మార్పుల కారణంగా నేడు లక్షలాది మంది మహిళలకు ఈ కల అందని ద్రాక్షలా మారుతోంది. గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదురుకావడం, ఒకవేళ గర్భం దాల్చినా పదేపదే గర్భస్రావాలు (Miscarriages) కావడం వంటి సమస్యలతో ఆసుపత్రుల ఔట్‌పేషెంట్ (OP) విభాగాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇలా పదేపదే గర్భస్రావాలు జరగడానికి అనేక శారీరక కారణాలు ఉన్నప్పటికీ.. వాటిలో థైరాయిడ్ రుగ్మతలు అత్యంత ప్రధానమైనవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
సంతానోత్పత్తిపై థైరాయిడ్ ప్రభావం..
పిండం ప్రారంభ ఎదుగుదలకు, జరాయువు (Placenta) సక్రమంగా పనిచేయడానికి గర్భాశయ ఆరోగ్యానికి థైరాయిడ్ హార్మోన్లు చాలా అవసరం. సంతానోత్పత్తిపై థైరాయిడ్ ప్రభావం పురుషులతో పోలిస్తే మహిళల్లోనే థైరాయిడ్ సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైపోథైరాయిడిజం (థైరాయిడ్ హార్మోన్ లోపం) మహిళల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.
నెలసరి సమస్యలు..
థైరాయిడ్ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల నెలసరి క్రమం తప్పుతుంది. ఇది అండం విడుదల (Ovulation) ప్రక్రియను ప్రభావితం చేసి గర్భధారణను కష్టతరం చేస్తుంది.ప్రోలాక్టిన్ పెరగడం: థైరాయిడ్ లోపం వల్ల శరీరంలో 'ప్రోలాక్టిన్' అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అండాల విడుదలను నిరోధిస్తుంది.
శిశువు ఎదుగుదల.. గర్భధారణ తొలి నెలల్లో పిండం మెదడు, శారీరక ఎదుగుదలకు తల్లి థైరాయిడ్ హార్మోన్లపైనే ఆధారపడుతుంది. ఈ హార్మోన్ సమతుల్యత లోపిస్తే పిండం అభివృద్ధి చెందడం కష్టమవుతుంది.నిర్లక్ష్యం వద్దు.. ఈ లక్షణాలు గమనించండి!చాలా మంది మహిళలు థైరాయిడ్ సంకేతాలను సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.. సాధారణంగా కనిపించే థైరాయిడ్ లక్షణాలు అధిక అలసట, నీరసం, అకస్మాత్తుగా బరువు పెరగడం జుట్టు విపరీతంగా రాలడం, మానసిక స్థితిలో మార్పులు (Mood Swings) క్రమం లేని నెలసరి (Irregular Periods)గర్భస్రావానికి.. TSH స్థాయిలకు ఉన్న సంబంధంసాధారణ మహిళలతో పోలిస్తే, శరీరంలో థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH) స్థాయిలు ఎక్కువగా ఉన్నవారికి గర్భస్రావం అయ్యే ముప్పు అత్యధికంగా ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ మార్గదర్శకాలు..
గర్భధారణకు ప్రణాళిక వేసుకునే మహిళలు తప్పనిసరిగా ముందే TSH పరీక్ష చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన గర్భధారణ కోసం శరీరంలో TSH స్థాయిని 2.5 mIU/L కంటే తక్కువగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే, ముందే చికిత్స తీసుకోవడం ద్వారా గర్భస్రావాల ముప్పును దాదాపు అరికట్టవచ్చు.
థైరాయిడ్ నియంత్రణకు నిపుణుల సూచనలు..
పోషకాహారం.. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్, సెలీనియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు అవసరం. ఇందుకోసం అయోడైజ్డ్ ఉప్పు, గుడ్లు, పాల ఉత్పత్తులు, నట్స్ బాదం, వాల్‌నట్స్, ఆకుకూరలను రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఒత్తిడి దూరం..
విపరీతమైన మానసిక ఒత్తిడి థైరాయిడ్ హార్మోన్లను మరింత అస్తవ్యస్తం చేస్తుంది. కాబట్టి నిత్యం యోగా, ధ్యానం (Meditation) చేయడం కనీసం 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర పోవడం ఎంతో ముఖ్యం. బరువు నియంత్రణ.. ఊబకాయం (Obesity) ఉన్నవారికి థైరాయిడ్ వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవాలి. పిల్లల కోసం ప్రయత్నిస్తున్న దంపతులు కేవలం గైనకాలజిస్ట్‌ను మాత్రమే కాకుండా, థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకుని, హార్మోన్ స్థాయిలు నార్మల్‌గా ఉండేలా చూసుకోవడమే సురక్షితమైన మాతృత్వానికి తొలి అడుగు.
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
