పిల్లల ఆరోగ్యానికి నిద్ర, ఆహారం ఎంత ముఖ్యమో తెలుసా..?
సాక్షి లైఫ్ : పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు, వారి మెదడు సరైన పనితీరుకు నిద్ర, పోషకాహారం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు అంశాలపై తల్లిదండ్రులకు సరైన అవగాహన ఉండాలని ఆయన సూచించారు. సరైన నిద్ర, ఆహారం లేకపోతే పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. పిల్లలకు ఎంత నిద్ర అవసరం అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?
పిల్లల వయసును బట్టి వారికి అవసరమయ్యే నిద్ర సమయం మారుతుంది.
0-3 నెలల శిశువులు: రోజుకు 14-17 గంటలు.
4-11 నెలలు: 12-15 గంటలు.
1-2 సంవత్సరాలు: 11-14 గంటలు.
3-5 సంవత్సరాలు: 10-13 గంటలు.
6-13 సంవత్సరాలు: 9-11 గంటలు.
14-17 సంవత్సరాలు: 8-10 గంటలు.
నిద్ర ఎందుకు ముఖ్యం..?
పిల్లలు నిద్రలో ఉన్నప్పుడు వారిలో ఎదుగుదల హార్మోన్లు విడుదల వుతాయి. తగినంత నిద్ర లేకపోతే పిల్లల ప్రవర్తనలో మార్పులు, చిరాకు, చురుకుదనం లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు నిద్రలేమి వల్ల నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి కూడా తగ్గుతాయి.
పిల్లలకు ఉత్తమ ఆహారాలు..
పిల్లల ఎదుగుదలకు పోషకాలు అవసరం. వారి ఆహారంలో ఈ కింది పదార్థాలు ఉండేలా చూడాలి:
ప్రోటీన్: కండరాలు, కణజాలాల ఎదుగుదలకు, రోగనిరోధక శక్తికి ప్రోటీన్ అవసరం. గుడ్లు, పాలు, పెరుగు, పప్పులు, చేపలు, చికెన్ లో ఇది లభిస్తుంది.
కాల్షియం: బలమైన ఎముకలు, దంతాలకు కాల్షియం చాలా ముఖ్యం. పాల ఉత్పత్తులు (పాలు, పెరుగు, జున్ను), బ్రోకలీ, ఆకుకూరలు కాల్షియంను అందిస్తాయి.
ఐరన్: రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ అవసరం. ఐరన్ లోపం వల్ల రక్తహీనత రావచ్చు. ఆకుకూరలు, బీన్స్, మాంసం వంటివి ఐరన్ ను అందిస్తాయి.
విటమిన్లు: విటమిన్ ఎ, బి, సి, డిలు పిల్లల కంటి చూపు, రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. క్యారెట్లు, నారింజ, నిమ్మకాయలు, పాలు, గుడ్లలో ఇవి పుష్కలంగా ఉంటాయి.
పిల్లలను జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉంచాలి. అధిక చక్కెర, ఉప్పు , అనవసరమైన కొవ్వు పదార్థాలు పిల్లల ఆరోగ్యానికి హానికరం అని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
