విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..  

సాక్షి లైఫ్ : తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారా? చిన్న గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతోందా? ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? అయితే మీ శరీరంలో విటమిన్-సి లోపం ఉండవచ్చు. ఇది మన రోగనిరోధక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన పోషకం. దీని లోపం వల్ల అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది.

 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

తరచుగా అనారోగ్యం: జలుబు, దగ్గు, ఫ్లూ వంటివి తరచుగా వస్తుంటే రోగనిరోధక శక్తి బలహీనపడినట్లే. అలసట, నీరసం: కారణం లేకుండా నిరంతరం అలసిపోయినట్లు, శక్తి లేనట్లు అనిపించడం విటమిన్-సి లోపానికి సంకేతం. చిగుళ్ల సమస్యలు: చిగుళ్ల నుంచి రక్తం కారడం, వాపు, దంతాలు కదలడం వంటివి విటమిన్-సి లోపం వల్ల కావచ్చు.

చర్మం పొడిబారడం, గాయాలు మానకపోవడం: చర్మం పొడిగా మారడం, గాయాలు త్వరగా నయం కాకపోవడం విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. కీళ్ల నొప్పులు, వాపు: తీవ్రమైన సందర్భాల్లో కీళ్ల నొప్పులు, వాపు కూడా విటమిన్-సి లోపం వల్ల రావచ్చు. పొడి జుట్టు, చిట్లిన వెంట్రుకలు: ఆరోగ్యకరమైన జుట్టుకు విటమిన్-సి అవసరం. దీని లోపం జుట్టు బలహీనపడటానికి కారణమవుతుంది.

 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : dental-problems skin-disease vitamin-c c-vitamin c-vitamin-deficiency vitamin-c-rich-foods vitamin-c-tablet cold vitamin-deficiency vitamin vitamins-in-fruit weakness vitamin-c-sources
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com