పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

సాక్షి లైఫ్ : "స్క్రీన్ సమయం పెరగడం వల్ల చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని" తాజా అధ్యయనంలో వెల్లడైంది. 89 శాతం మంది భారతీయ తల్లులు తమ పిల్లల స్క్రీన్ టైమ్ గురించి ఆందోళన చెందుతున్నారని మార్కెట్ రీసెర్చ్ సంస్థ టెచార్క్ ఇటీవలి నివేదిక వెల్లడించింది. 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

3-10 తరగతుల పిల్లలతో నాలుగు మెట్రో నగరాల్లో పని చేస్తున్న 600 మంది తల్లులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నేటి డిజిటల్ లైఫ్ లో తల్లులు తమ పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆందోళనలపై  అభిప్రాయాలను పంచుకున్నారు.

పిల్లల స్క్రీన్ సమయంపై తల్లుల ఆందోళన..  
 
తల్లులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలకు సంబంధించిన వివిధ అంశాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. గోప్యత (81 శాతం), అనుచితమైన కంటెంట్‌కు గురికావడం (72 శాతం), టీనేజ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ప్రభావం (45 శాతం)నకిలీలు, వంచన (26 శాతం)తో సంబంధం ఉన్న రిస్క్‌లు మరింతగా ఆందోళన కలిగిస్తున్నాయని తల్లులు చెబుతున్నారు. 

ఫ్యూచర్ వర్రీస్.. 

ఫేక్‌లు, Gen AIకి సంబంధించిన భవిష్యత్తు సవాళ్లు మరింతగా పెరుగుతాయని, పిల్లల ప్రతిష్ట, విశ్వసనీయతపై ప్రతికూల ప్రభావం పడుతుందని తల్లులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సాంకేతికత పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులకు, పిల్లలకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే నెలకొంటుందని అధ్యయనంలో వెల్లడైంది. 

ఇది కూడా చదవండి.. స్కిజోఫ్రెనియాకు కారణాలేంటి..?

పిల్లలపై వీఆర్ హెడ్‌సెట్‌ల ప్రభావం.. 

వీఆర్ హెడ్‌సెట్‌ల కారణంగా తీవ్ర ప్రభావం చిన్నారులపై ఉంటుందని, ముఖ్యం పర్యావరణం పట్ల శ్రద్ధ కోల్పోయే ప్రమాదం కూడా ఉందని నివేదిక పేర్కొంది. ఈ అధ్యయనం తల్లులు, పిల్లలు, డిజిటల్ ప్రపంచం మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని నొక్కి చెబుతుంది.  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : depression mental-tensions stress kids-health parenting-tips kids-health-care children-health-tips stress-mind lifestyle healthy-lifestyle screen-time digital

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com