Sleep : చిన్నారుల్లో నిద్ర తగ్గితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?

సాక్షి లైఫ్ : పిల్లల ఎదుగుదలలో పౌష్టికాహారం ఎంత ముఖ్యమో, అంతకంటే కూడా నిద్ర చాలా ముఖ్యం. శారీరక ఆరోగ్యానికే కాకుండా, మెదడు చురుగ్గా పనిచేయడానికి, మానసిక ఉల్లాసానికి గాఢ నిద్ర అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, మారుతున్న జీవనశైలి కారణంగా నేడు చాలా మంది పిల్లలు నిద్రలేమితో సతమతమవుతున్నారు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

నిద్ర తగ్గితే..!

నేషనల్ స్లీప్ ఫౌండేషన్ (NSF) గణాంకాల ప్రకారం, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే దాదాపు 44 శాతం మంది పిల్లలు సరైన సమయం నిద్రపోవడం లేదు. నిద్ర లేకపోవడం అనేది కేవలం ఆ బిడ్డ సమస్య మాత్రమే కాదు, అది మొత్తం కుటుంబంపై ప్రభావం చూపుతుంది.

సర్వేలో పాల్గొన్న 80 శాతం మంది తల్లిదండ్రులు.. పిల్లల నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల తమ దినచర్య కూడా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన నిద్ర ఉండే పిల్లల్లో ఏకాగ్రత, మంచి ప్రవర్తన ఉంటాయని 86 శాతం మంది తల్లిదండ్రులు విశ్వసిస్తున్నారు.

చాలా సందర్భాల్లో..

చాలా సందర్భాల్లో పిల్లలకు ఎంత నిద్ర అవసరమనే విషయంలో తల్లిదండ్రులకు సరైన అవగాహన ఉండటం లేదు. ముఖ్యంగా మూడు నెలల లోపు పసిబిడ్డల విషయంలో 78 శాతం మంది తల్లిదండ్రులు పొరపడుతున్నారు. వారికి అవసరమైన దానికంటే ఒక గంట తక్కువగానే నిద్రపుచ్చుతున్నారు. తమ బిడ్డ సరిగ్గా నిద్రపోతున్నాడా లేదా అని తల్లిదండ్రులు రోజుకు సగటున రెండు గంటల సమయం వృథాగా ఆందోళన చెందుతున్నారు. నిద్ర ప్రాముఖ్యత గురించి పిల్లలతో చర్చించే అలవాటు చాలా తక్కువగా ఉంటోంది.

నిద్ర అలవాట్లను..

పిల్లల్లో ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు పెంపొందించడానికి నిపుణులు ఈ క్రింది సూచనలు చేస్తున్నారు.నిద్రవేళ దినచర్య (Bedtime Routine).. కేవలం లైట్లు ఆర్పేయడం మాత్రమే నిద్ర కాదు. పడుకునే ముందు ఒక పద్ధతిని అలవాటు చేయండి. ఉదాహరణకు.. స్నానం చేయించడం, బట్టలు మార్చడం, చిన్న కథలు చెప్పడం వంటివి చేస్తే మెదడు నిద్రకు సిద్ధమవుతుంది. పడుకోవడానికి గంట ముందే టీవీ, మొబైల్, వీడియో గేమ్స్‌కు స్వస్తి చెప్పాలి. వాటి నుంచి వచ్చే 'బ్లూ లైట్' నిద్రను దూరం చేస్తుంది. ప్రశాంతమైన సంగీతం లేదా పుస్తక పఠనం ఉత్తమం.
 

జీవ గడియారం..

ఉదయం నిద్రలేవగానే పిల్లలను కాసేపు ఎండలో ఆడనివ్వాలి. దీనివల్ల శరీరంలోని జీవ గడియారం (Circadian Rhythm) కంట్రోల్లో ఉండడమేకాకుండా, రాత్రి సమయంలో వెంటనే నిద్ర పడుతుంది. అందుకోసమే పగటిపూట తగినంత శారీరక శ్రమ ఉండేలా చూడండి. అయితే, పడుకునే ముందు మాత్రం భారీ వ్యాయామాలు లేదా గెంతులు వేయడం వంటివి చేయించకూడదు.  

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kids-health kids-health-care sleep-quality sleep sleeping
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com