Thyroid : థైరాయిడ్‌తో జాగ్రత్త.. జీవక్రియకు ఇది 'కీలకం'!.. నిపుణుల హెచ్చరిక
సాక్షి లైఫ్ : మెడ భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారపు చిన్న గ్రంథి.. మన శరీర మొత్తం పనితీరును శాసిస్తుందని మీకు తెలుసా? బరువు పెరగడం, శక్తి తగ్గడం, గుండె స్పందన రేటులో మార్పులు వంటివన్నీ థైరాయిడ్ పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా భారత్‌లో ప్రతి పదిమందిలో ఒకరు హైపోథై రాయిడిజంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..
మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
శరీరంలో ఒకేసారి అధిక రక్తపోటు (BP), రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం (Sugar), నడుము చుట్టూ కొవ్వు చేరడం వంటి సమస్యలు సమూహంగా దాడి చేయడాన్ని 'మెటబాలిక్ సిండ్రోమ్' అంటారు. ఇది గుండెపోటు, స్ట్రోక్ , టైప్-2 డయాబెటిస్ ముప్పును పెంచుతుంది.
మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి హైపోథైరాయిడిజం ఉండే అవకాశం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
నిపుణులు ఏమంటున్నారు..?
శరీరానికి తగినంత థైరాయిడ్ హార్మోన్లు అందనప్పుడు జీవక్రియ మందగిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఫలితంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని ఎండోక్రైనాలజిస్ట్ డా. వి.బి. కశ్యప జన్నాభట్ల చెబుతున్నారు.
హైపోథైరాయిడిజం లక్షణాలు ప్రారంభంలో గుర్తించడం కష్టం. కాబట్టి మెటబాలిక్ రిస్క్ ఉన్నవారు క్రమం తప్పకుండా థైరాయిడ్ స్క్రీనింగ్ చేయించుకోవడం అత్యవసరం అని అబాట్ ఇండియాకు చెందిన డా. కిన్నెర పుట్రేవు అంటున్నారు.
థైరాయిడ్ అదుపునకు 4 సూత్రాలు..
ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెరలు, సోయా ఉత్పత్తులను తగ్గించాలి. సరైన పోషకాహారం థైరాయిడ్ గ్రంథికి బలాన్నిస్తుంది. వైద్యులు సూచించిన మందులను సరైన సమయానికి వేసుకోవాలి. సొంత నిర్ణయాలతో మోతాదును మార్చడం లేదా ఆపేయడం ప్రమాదకరం. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, సైక్లింగ్ లేదా ఈత వంటి వ్యాయామాలు చేయాలి. ఇది జీవక్రియను వేగవంతం చేసి బరువు అదుపులో ఉండేలా చేస్తుంది.
ఒత్తిడి పెరిగితే విడుదలయ్యే 'కార్టిసాల్' హార్మోన్ థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తుంది. యోగా, ధ్యానం ద్వారా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. వ్యాధి వచ్చాక చింతించడం కంటే.. ముందస్తు స్క్రీనింగ్, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ద్వారా థైరాయిడ్, మెటబాలిక్ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
