Rising Fatty Liver Risk in Children : 14 ఏళ్ల వయస్సు లోపు పిల్లల్లో 'ఫ్యాటీ లివర్' ముప్పు.. పట్టణాల్లోనే అధికం..
సాక్షి లైఫ్ : ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలో కనిపించే కాలేయ సంబంధిత సమస్యలు.. ఇప్పుడు పదేళ్ల చిన్నారులను కూడా వదలడం లేదు. 'నిశ్శబ్ద హంతకి'గా మారిన ఫ్యాటీ లివర్ వ్యాధి 10 నుంచి 14 ఏళ్ల వయస్సు గల పిల్లల్లో సర్వసాధారణంగా కనిపిస్తోంది. గంటల తరబడి మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ అలవాట్లు చిన్నారుల ఆరోగ్యాన్ని చిదిమేస్తున్నాయి.
ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?
అలవాట్లే శాపంగా..
నగరాల్లోని పిల్లల జీవనశైలి పూర్తిగా మారిపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని పీడియాట్రిషియన్స్ చెబుతున్నారు. అంతేకాకుండా ఆసుపత్రులకు వస్తున్న కేసుల్లో ఎక్కువ శాతం మారుతున్న అలవాట్లే కారణమని వారు అంటున్నారు. టీవీ లేదా మొబైల్ చూస్తూ ఆహారం తీసుకోవడం వల్ల పిల్లలు ఎంత తింటున్నారో గమనించలేక పోతున్నారు. పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, శీతల పానీయాలకు అలవాటు పడటం వల్ల శరీరంలో అనవసర కొవ్వు చేరుతోంది. ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాన్ని పదేపదే వేడి చేసి తినడం వల్ల అందులోని పోషకాలు నశించి కాలేయంపై ఒత్తిడి పెరుగుతోంది.
స్టడీలో బయటపడిన నిజాలు..
ఇటీవల వెలుగు చూసిన కొన్ని కేసులు తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
పదేళ్ల రవికుమార్ నిరంతరం జంక్ ఫుడ్ తినడం వల్ల కడుపునొప్పి బారిన పడ్డాడు. పరీక్షల్లో ఫ్యాటీ లివర్ అని తేలింది.
14ఏళ్ల వయసున్న నరేంద్ర రోజంతా మొబైల్ గేమ్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయ వ్యాధి బారిన పడ్డాడు.
మరికొందరు చిన్నారులు గ్యాస్ సమస్య అని భావించి ఆసుపత్రికి వెళ్తే.. కాలేయంలో కొవ్వు పేరుకుపోయినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
ముందస్తు జాగ్రత్తలే రక్ష..!
సకాలంలో స్పందించకపోతే భవిష్యత్తులో మధుమేహం, రక్తపోటు, హెపటైటిస్ వంటి తీవ్ర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పు నుంచి పిల్లలను కాపాడుకోవడానికి ఈ మార్పులు తప్పనిసరిగా చేయాలని వారు వెల్లడిస్తున్నారు.ప్యాక్ చేసిన జ్యూస్‌లు, జంక్ ఫుడ్ పూర్తిగా మాన్పించాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలను అలవాటు చేయాలి.
రోజుకు కనీసం గంట పాటు ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి.మొబైల్, టీవీ చూసే సమయాన్ని పరిమితం చేయాలి. ఎదిగే పిల్లలకు రోజుకు 8 గంటల గాఢ నిద్ర అవసరం. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఇప్పటికీ ఇంటి భోజనం తింటూ, శారీరక శ్రమతో కూడిన పనులు చేస్తుండటం వల్ల అక్కడ ఫ్యాటీ లివర్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్‌ఫ్లమేషన్‌కు లింక్ ఏమిటి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
