ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నేటి వేగవంతమైన జీవనశైలిలో సమయం లేకపోవడం, సౌలభ్యం కోసం ప్రజలు ఆల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలకు బానిసలవుతున్నారు. కంటికి ఇంపుగా, నాలుకకు రుచికరంగా కనిపించే ఈ ఆహారాలు నిజానికి ఆరోగ్యాన్ని మెల్లమెల్లగా క్షీణింపజేసే విషతుల్యమైన పదార్థాలు. బిజీగా ఉండే వాళ్లు తమ ఆహారపు అలవాట్లపై పెద్దగా దృష్టి పెట్టలేకపోవడం దీనికి ప్రధాన కారణం.

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

తక్కువ సమయంలో తయారుచేయగలిగే, మంచి రుచినిచ్చే ఎంపికల కోసం వెతుకుతారు. అయితే, ఈ 2 నిమిషాల రుచి దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య పరిణామాలను కలిగిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే రసాయనాలు ఉపయోగించి తయారుచేసే ఆహార పదార్థాలు. వీటిలో సహజసిద్ధమైన పదార్థాలు దాదాపుగా ఉండవు. రుచి, రంగు, మన్నిక పెంచడానికి ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్ ఏజెంట్లు, కలరింగ్ ఏజెంట్లు, అధిక చక్కెర, ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్ వంటివి భారీగా కలుపుతారు.

ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కు ఉదాహరణకు, ప్యాక్ చేసిన బిస్కెట్లు, చిప్స్, రెడీ-టు-ఈట్ మీల్స్ (రాజ్మా రైస్, దాల్ మఖానీ), కార్బోనేటెడ్ డ్రింక్స్, తినడానికి సిద్ధంగా ఉన్న మాంసం, పౌల్ట్రీ, సీ ఫుడ్ ప్రోడక్ట్స్ కృత్రిమంగా లేదా చక్కెరతో తియ్యటి పానీయాలు, శీతల పానీయాలు,ఆల్ట్రాప్రాసెస్డ్ అల్పాహార ఆహారాలు..పాల ఆధారిత డెజర్ట్‌లు వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఇవి శరీరానికి విషంగా మారతాయి.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.