ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన జీవనం కోసం సరైన ఆహారపు అలవాట్లు ఎంతో ముఖ్యం. ఇందులో భాగంగా పండ్లు, కూరగాయలతో నిండిన సలాడ్లు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు, సలాడ్ మన ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది. అయితే, సలాడ్‌ను ఎప్పుడు తింటే పూర్తి ప్రయోజనం లభిస్తుందో చాలామందికి సందేహం ఉంటుంది. భోజనానికి ముందా లేక భోజనంతో పాటా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
సలాడ్ ఎప్పుడు తినాలి అంటే..?
సలాడ్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది, తద్వారా అతిగా తినకుండా నిరోధిస్తుంది. ఈ కారణం వల్లే సలాడ్‌ను భోజనానికి అరగంట ముందు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
అతిగా తినకుండా నివారణ: భోజనానికి ముందు సలాడ్ తినడం వల్ల ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల మీరు ప్రధాన భోజనంలో తక్కువ ఆహారం తీసుకుంటారు, తద్వారా కేలరీల వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇది బరువు నియంత్రణకు చాలా సహాయపడుతుంది.
పోషకాల పూర్తి గ్రహింపు: పండ్లు, కూరగాయలతోకూడిన సలాడ్ లో లభించే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి సులభంగా అందుతాయి. ఇది పోషకాల పూర్తి ప్రయోజనాన్ని అందిస్తుంది.
సలాడ్ తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు..
సలాడ్లు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తి పెంపు: సలాడ్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది శరీరాన్ని వివిధ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
బరువు తగ్గింపు: సలాడ్‌లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ఆకలిని నియంత్రిస్తుంది, అనవసరమైన స్నాక్స్ తినడాన్ని తగ్గిస్తుంది. ఇది వేగంగా ,ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జీర్ణక్రియ మెరుగుదలకు : సలాడ్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, ఆమ్లత్వం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ హెల్త్ కు దోహదపడుతుంది.
సంపూర్ణ పోషకాహారం: సలాడ్లు విటమిన్లు (ఏ , సి, కె , ఫోలేట్), ఖనిజాలు (పొటాషియం, ఐరన్), యాంటీఆక్సిడెంట్లకు మంచి వనరులు. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
