పగటి నిద్ర అలవాటు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
సాక్షి లైఫ్ న్యూస్ : నిద్ర అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. నిద్ర మనిషి ఎనర్జీని రీఛార్జ్ చేస్తుంది. ముఖ్యంగా భోజనం తర్వాత కొంతమంది మధ్యాహ్నం నిద్రపోతుంటారు. భోజనం తర్వాత జీర్ణవ్యవస్థకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల మెదడుకు రక్తం సరఫరా తక్కువగా జరుగుతుంది.
నిద్రలేమి, అలసటకు దారితీస్తుంది. మరొక సిద్ధాంతం ప్రకారం, భోజనం తర్వాత శరీరంలో పెరిగిన గ్లూకోజ్ స్థాయిల కారణంగా నిద్రవచ్చినట్లు అనిపించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కొంతమందికి ప్రతిరోజూ మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిదా ..? కాదా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
నేషనల్ స్లీప్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం..యునైటెడ్ స్టేట్స్‌లో ముగ్గురిలో ఒకరు క్రమం తప్పకుండా మధ్యాహ్నం నిద్రపోతారట. ఎక్కువసేపు కాకుండా కొద్దిసేపు నిద్రించడంవల్ల మరింత ఎనర్జిటిక్ గా ఉంచడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ప్రతిరోజూ నిద్రించే అలవాటు ఉన్నవారిలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర మనిషికి ఎంతో ఆరోగ్యకరమని జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలోనూ , కార్యాచరణను పెంచడంలోనూ ప్రయోజనకరంగా ఉంటుందని హార్వర్డ్ హెల్త్ నివేదించింది. కానీ ఇది అలవాటుగా మారితే దీర్ఘకాలంలో అనేక ప్రతికూల ప్రభావాలకు దారి తీస్తుందని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హార్వర్డ్ హెల్త్ తెలిపింది. పగటిపూట నిద్ర సమయం పెరిగితే, అనేక రకాల ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
పగటిపూట ఎక్కువగా నిద్రపోయే పెద్దలు మధుమేహం, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హార్వర్డ్ హెల్త్ ఎక్స్పర్స్ వెల్లడిస్తున్నారు. ఐతే రాత్రిపూట నిద్రలేమి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి రాత్రిపూట తగినంత నిద్రపోవాలని వారు చెబుతున్నారు.
కొన్ని సందర్భాల్లో పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవడంవల్ల రాత్రిపూట నిద్రకి అంతరాయం కలిగే అవకాశం ఉంది. శరీరం, మనస్సు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతి రోజూ 6 నుంచి 8 గంటలు నిరంతరాయంగా నిద్రపోయేలా చూసుకోవడం చాలా ముఖ్యం అని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఉదయం నిద్ర గురించి నిపుణులు ఏమంటున్నారంటే..?
మధ్యాహ్నం సమయంలో రోజుకు 20-30 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోకూడదు" అని వైద్య నిపుణులు అంటున్నారు. తేలికపాటి నిద్ర హృదయ స్పందన రేటును పెంచుతుందట. మధ్యాహ్నం పూత ఎక్కువ సమయం నిద్ర పొతే అది రాత్రి నిద్రపై ప్రభావం చూపిస్తుందిట.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
