Mental Health Issues : మానసిక సమస్యలపై పెరుగుతున్న అలసత్వం: నిమ్హాన్స్ అధ్యయనంలో విస్తుపోయే నిజాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మానసిక సమస్యలు, వ్యసనాలతో సతమతమవుతున్న బాధితుల్లో అత్యధికులు వృత్తిపరమైన వైద్య చికిత్సను పొందేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని బెంగళూరులోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్’ (నిమ్హాన్స్) NIMHANS తాజా అధ్యయనంలో వెల్లడైంది. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో ప్రజల్లో నెలకొన్న అపోహలు, నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

77 శాతం మంది మానసిక సమస్యలు ఉన్నప్పటికీ..

సుమారు 35,023 మంది వయోజనులపై నిర్వహించిన విస్తృత పరిశీలనలో 77 శాతం మంది మానసిక సమస్యలు ఉన్నప్పటికీ చికిత్సకు దూరంగా ఉంటున్నారని తేలింది. ముఖ్యంగా వ్యసనాల బారిన పడిన వారిలో 92.5 శాతం మంది ఇప్పటివరకు ఎలాంటి వైద్య సహాయాన్ని కోరకపోవడం గమనార్హం. సమస్యను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ, కేవలం వేళ్లమీద లెక్కించదగిన కొద్దిమంది మాత్రమే వైద్యుల వద్దకు వెళ్లినట్లు పరిశోధకులు గుర్తించారు.

సంకోచించడం, మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత..

సమస్య ఉందని ఒప్పుకోవడానికి సంకోచించడం, మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, ఆన్‌లైన్ లేదా సోషల్ మీడియా ఆధారిత స్వీయ చికిత్సలు (Self-medication) నిపుణుల సలహాలకు అడ్డంకిగా మారుతున్నాయని రీసెర్చర్స్ చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘టెలీ-మానస్’ (Tele-MANAS) వంటి 24 గంటల హెల్ప్‌లైన్ వ్యవస్థలను, గ్రామీణ స్థాయిలో ఆశా కార్యకర్తల ద్వారా అవగాహనను కల్పిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల మానసిక ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధ్యయనం స్పష్టం చేసింది.

 ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.