సాక్షి లైఫ్ : కివి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన పోషకాలు అధికంగా ఉండే పండు. కివీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పైకి లేత గోధుమ రంగులో కనిపించే ఈ పండును రెండుగా కట్ చేస్తే చక్కని ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కివిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వాటిలో విటమిన్లు A, B6, B12, E, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము ఉన్నాయి. వీటిలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
ఇది కూడా చదవండి.. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?
ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
చర్మ వ్యాధులురాకుండా..
మూత్రంలో రాళ్లను తొలగించడంలో కివి చాలా మంచిది. కివీ పండు చర్మ వ్యాధులురాకుండా ఉంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. నారింజలో ఉన్న విటమిన్ సి కంటే రెండు రెట్లు ఎక్కువగా కివి లో లభిస్తుంది. అరటిపండ్ల కంటే పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కివి తినడం వల్ల చర్మం కాంతివంతంగా, అందంగా ఉండొచ్చు.
కివీలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. శరీరంలోని అదనపు కొవ్వును తొలగించడంలో యాంటీఆక్సిడెంట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొవ్వు ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
కాలేయాన్ని రక్షించడానికి..
కివిలో విటమిన్ "సి", కోలిన్, లుటిన్ , జియాక్సంతిన్ పుష్కలంగా ఉన్నాయి. అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌తో పాటు, కివీస్ ఫైబర్ కు కూడా గొప్ప మూలం. ఇది జీర్ణ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, కాలేయాన్ని రక్షించడానికి, రక్తంలో చక్కెరను రక్తపోటును తగ్గించడానికి బరువును నిర్వహించడానికి కూడా ఉపయోగపడుతుంది.
కివీ పండు ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది. కివీలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కివీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడతాయి.
వైరల్ ఫీవర్, జలుబు వంటి వ్యాధుల విషయంలో..
కివీ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ఎంతగానో మేలుచేస్తుంది. కివీ పండ్ల వినియోగం అడిపోజెనిసిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే మధుమేహాన్ని నివారిస్తుందని, వైరల్ ఫీవర్, జలుబు వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో కివీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఇది కీలక పాత్రపోషిస్తుంది.
ఇది కూడా చదవండి.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com