ఇలాంటి మెట్రెస్‌ తో చిన్నారులకు తీవ్ర అనారోగ్య సమస్యలు..  

షేర్ చేయండి:
ఇలాంటి మెట్రెస్‌ తో చిన్నారులకు తీవ్ర అనారోగ్య సమస్యలు..  

సాక్షి లైఫ్ : పిల్లలు నిద్రించే సమయంలో మెట్రెస్‌ల నుంచి హానికరమైన రసాయనాలు విడుదలవుతున్నాయని  పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయం ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ రసాయనాలు పిల్లల మెదడు ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని మెట్రెస్‌లలో ఉపయోగించే ఫోమ్, రసాయన పదార్థాలు, ముఖ్యంగా వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీఓసీలు), నిద్ర సమయంలో గాలిలోకి విడుదలవుతాయి.

 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

ఈ పదార్థాలు పిల్లల శ్వాసకోశ వ్యవస్థ ద్వారా శరీరంలోకి ప్రవేశించి, మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు రోజులో ఎక్కువ గంటలు నిద్రలో గడుపుతారు. కాబట్టి, వారు పడుకునే మెట్రెస్‌లు సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు.

 

చిన్నారుల ఆరోగ్యం కోసం సేంద్రీయ పదార్థాలతో తయారైన, రసాయన రహిత మెట్రెస్‌లను ఎంచుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. మంచి వెంటిలేషన్, రసాయన రహిత పరుపులను ఉపయోగించడం ద్వారా పిల్లలను ఈ హానికర రసాయనాల బారీ నుంచి కాపాడవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి..మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 రోజువారీ అలవాట్లు.. 

ఇది కూడా చదవండి..20 ఏళ్లలోపు వారికే గుండెపోటు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలు.. 

ఇది కూడా చదవండి..బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.