Healthy Diet : పోషకాలు నిండిన దేశీ శాకాహార ప్రత్యామ్నాయాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం తీసుకునే అల్పాహారం శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందిస్తుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. శరీర కండరాల దృఢత్వానికి, ఆకలి నియంత్రణకు చాలామంది కోడిగుడ్లపై ఆధారపడతారు. అయితే పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకునేవారికి లేదా గుడ్లు తిననివారికి మన భారతీయ సంప్రదాయ వంటింట్లోనే అద్భుతమైన ప్రొటీన్ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.

పెసరపప్పు అట్టు..

పెసరపప్పు ప్రొటీన్‌కు అద్భుతమైన వనరు. నానబెట్టిన పెసరపప్పుతో పిండి సిద్ధం చేసుకుని, అందులో ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వంటి కూరగాయలు జోడించి వేడివేడి అట్లు వేసుకోవచ్చు. దీనిని పెరుగుతో కలిపి తీసుకుంటే పోషక విలువలు రెట్టింపవుతాయి.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 

శనగపిండి దోశ..

ఉదయాన్నే తక్కువ సమయంలో సులువుగా తయారయ్యే పోషకాహారం శనగపిండి దోశ. ఇందులో శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రొటీన్‌తో పాటు జీర్ణక్రియకు మేలు చేసే పీచు పదార్థం (Fiber) పుష్కలంగా లభిస్తుంది.

పన్నీర్ కాంబినేషన్లు.. శాఖాహారులకు మేలైన ప్రొటీన్ వనరులలో పన్నీర్ ఒకటి. పన్నీర్ భుర్జీ, పన్నీర్ రోల్ లేదా కూరగాయలతో కూడిన పన్నీర్ శాండ్‌విచ్ రూపంలో దీనిని తీసుకోవచ్చు. ఇది ప్రొటీన్‌తో పాటు ఎముకల పటుత్వానికి అవసరమైన క్యాల్షియాన్ని సైతం అందిస్తుంది.

మొలకెత్తిన గింజలు (Sprouts)..

మొలకెత్తిన పెసలు, శనగలు, ఇతర పప్పుధాన్యాలను ఉదయం సలాడ్ లేదా చాట్ రూపంలో తీసుకోవడం శరీరానికి ఎంతో మంచిది. వీటికి నిమ్మరసం, ఉల్లిపాయ, టమాట, కాస్త మిరియాల పొడి జోడించి తింటే ప్రొటీన్‌తో పాటు సూక్ష్మ పోషకాలు లభిస్తాయి.

పెరుగు,శనగల సలాడ్..

ఉడికించిన తెల్ల లేదా నల్ల శనగలను చిలికిన పెరుగుతో కలపడం ద్వారా తేలికైన, బలవర్ధకమైన అల్పాహారం సిద్ధమవుతుంది. శనగల నుంచి ప్రొటీన్, ఫైబర్ లభిస్తే.. పెరుగు ప్రోబయోటిక్స్‌తో పాటు క్యాల్షియం, ప్రొటీన్లను అందిస్తుంది.

అల్పాహారంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. 

కేవలం ప్రొటీన్‌పై మాత్రమే దృష్టి పెట్టకుండా పిండి పదార్థాలు (carbohydrates), ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థాల సమతుల్యత ఉండేలా చూసుకోవాలి. వయసు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరి ప్రొటీన్ అవసరాలు మారుతుంటాయి. ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఆహార నిపుణుల సలహాతో డైట్ ప్లాన్ చేసుకోవడం బెస్ట్.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.