Eating Sweets : తీపి బాగా ఇష్టమా..? అయితే రోజుకు ఎంత తినాలో తెలుసుకోండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. మనం రోజూ తీసుకునే ఆహారం మన బరువు, గుండె, కాలేయం, జీవక్రియలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆరోగ్య నిపుణులు అత్యంత ప్రమాదకరంగా భావించే వాటిలో 'చక్కెర' (Sugar) మొదటి స్థానంలో ఉంటుంది. మోతాదుకు మించి చక్కెర తీసుకుంటే ఊబకాయం, ఫ్యాటీ లివర్ తదితర తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 

అసలు చక్కెర ఎందుకు ప్రమాదకరం..?

చక్కెరలో క్యాలరీలు అత్యధికంగా ఉంటాయి. ఇది అమాంతం బరువు పెరగడానికి, తద్వారా ఊబకాయానికి దారితీస్తుంది.
తీపి పదార్థాలు తినగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరిగిపోతాయి. దీర్ఘకాలం పాటు అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ దెబ్బతిని 'టైప్-2 డయాబెటిస్' వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

 చక్కెర అధికంగా తినడం వల్ల రక్తపోటు (bp), చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇది హృద్రోగాలకు దారితీస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఎవరికి.. ఎంత మోతాదు సురక్షితం..?

ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం.. రోజువారీ చక్కెర వినియోగం వయసును బట్టి మారుతుంది. అయితే సగటున రోజుకు 25 నుంచి 35 గ్రాములకు మించి తీసుకోకూడదు.

పురుషులు.. రోజుకు గరిష్టంగా 36 గ్రాములు (సుమారు 9 టీస్పూన్లు).

మహిళలు.. రోజుకు గరిష్టంగా 25 గ్రాములు (సుమారు 6 టీస్పూన్లు).

పిల్లలు.. సాధారణంగా 20 నుంచి 25 గ్రాములకు మించకూడదు.

పసిపిల్లలు: రెండేళ్ల లోపు వయసున్న చిన్నారులకు అదనపు చక్కెర (Added sugars) కలిపిన ఆహారం అస్సలు ఇవ్వకూడదు.

టీలో చక్కెర తగ్గిస్తే సరిపోతుందా..?

చాలామంది టీ లేదా పాలలో చక్కెర తగ్గించేశాం కదా అనుకుంటారు. కానీ, మనం రోజూ తినే ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్ చేసిన పదార్థాల్లో 'హిడెన్ షుగర్' ఉంటుంది. క్యాండీలు, ప్యాకేజ్డ్ పండ్ల రసాలు, కోల్డ్ డ్రింక్స్, సోడాలలో అత్యధికంగా చక్కెర ఉంటుంది. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పండ్లలో సహజసిద్ధమైన చక్కెర ఉంటుంది. అయితే వాటిని జ్యూస్ రూపంలో తీసుకునే కంటే.. నేరుగా ముక్కలుగా తినడమే మంచిది. దీనివల్ల పండ్లలోని ఫైబర్ మన శరీరానికి పూర్తిగా అందుతుంది.

సూపర్ మార్కెట్లలో ఏదైనా ప్యాక్ చేసిన ఆహారం కొనేముందు దానిపై ఉన్న 'న్యూట్రిషన్ లేబుల్' చూసి అందులో యాడెడ్ షుగర్ ఎంతుందో గమనించాలి. చక్కెర మానేసి బెల్లం, ఖర్జూరం లాంటి ప్రత్యామ్నాయాలు వాడినా సరే, వాటిలోనూ క్యాలరీలు ఉంటాయి కాబట్టి పరిమితంగానే తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.