Scientific Reasons : నాన్-స్టిక్ పాత్రలు ఆరోగ్యానికి ఎందుకు హానికరం..?

షేర్ చేయండి:
Scientific Reasons : నాన్-స్టిక్ పాత్రలు ఆరోగ్యానికి ఎందుకు హానికరం..?

సాక్షి లైఫ్ : నాన్‌స్టిక్ కోటింగ్ టెఫ్లాన్ ను అనేక రకాల వంటసామాను వస్తువులపై ఉపయోగిస్తున్నారు. టెఫ్లాన్ అనేది ఓ రకమైన రసాయనిక సమ్మేళన పూత. జ్వరం, కండరాల నొప్పి, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి వంటి ఫ్లూ వంటి లక్షణాలతో ఈ టెఫ్లాన్ ఫ్లూ మొదలవుతుంది. నాన్ స్టిక్ పాత్రలను ఎక్కువగా వేడి చేయడం, లేదా సరైన విధానంలో ఉపయోగించకపోవడం వల్లనే టెఫ్లాన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

 

వంట చేసేటప్పుడు నాన్ స్టిక్ పాన్ల నుంచి వచ్చే పొగ కారణంగా 12 గంటల నుంచి 24 గంటలలోపు దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ లక్షణాలు తాత్కాలికమే అయినప్పటికీ, నిపుణులు ఈ పరిస్థితి వల్ల ఎలాంటి నష్టం ఉండదని చెబుతుండగా, మరికొందరు మాత్రం టెఫ్లాన్ ఫ్లూ భవిష్యత్ లో మరిన్ని అనారోగ్య సమస్యలు కలిగించే ప్రమాదం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.

 
 సరైన పాత్రలలో వండిన ఆహారం "హెల్తీగా" ఉంటుందని, జీర్ణం కావడానికి సులభంగా ఉంటుందని ఆయుర్వేద వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ తోపాటు వంట చేసేటప్పుడు ఉపయోగించే పాత్రలు కూడా చాలా ముఖ్యమని వైద్యనిపుణులు, పరిశోధకులు వెల్లడిస్తున్నారు. హెల్తీగా పరిగణించే కొన్ని పాత్రలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మట్టి కుండలు..  

మట్టి కుండల్లో ఆహారం నెమ్మదిగా ఉడుకుతుంది. ఇలా నెమ్మదిగా ఉడకడం వల్ల ఆహారం రుచి కూడా పెరుగుతుంది. తొందరగా పాడవకుండా ఉంటుంది.

రాగి పాత్రలు.. 

సరిగ్గా ఉపయోగిస్తే, రాగి పాత్రలు నీటిని శుద్ధి చేస్తాయి. అవి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

స్టెయిన్‌లెస్ స్టీల్.. 

స్టెయిన్‌లెస్ స్టీల్ స్ట్రాంగ్ గా, సురక్షితంగా ఉంటుంది. అన్నింటికంటే ఉత్తమమైనది, ఇది కడుపు లేదా ప్రేగులకు ఎలాంటి హాని కలిగించదు. మీ ఆరోగ్యానికి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.

నాన్-స్టిక్ పాత్రలు.. 

 నాన్-స్టిక్ పాన్‌లు వాడడం వల్ల ఆహారంలోకి రసాయనాలు కలుస్తాయి. అందువల్ల, ఈ రసాయనాలను నివారించడానికి, నాన్-స్టిక్ వంట సామాగ్రిని వాడకూడదు. వీటికి బదులుగా సాంప్రదాయ పాత్రలను వాడడం ఉత్తమం.

సైన్స్ ఏమి చెబుతుంది..?

సాంప్రదాయ వంట సామాగ్రి ఆహారాన్ని సమానంగా వేడి చేస్తుంది.  పోషకాల నష్టాన్ని నిరోధిస్తుంది. అటువంటి వాటిలో వంట చేయడం వల్ల ఆహారంలోకి ఎటువంటి హానికరమైన అంశాలు ప్రవేశించవు. ఫలితంగా మరింత రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందవచ్చు, తద్వారా జీర్ణక్రియ మెరుగుపడడమేకాకుండా మీ శరీర సమతుల్యతను కాపాడుకోవడానికి వీలుకలుగుతుంది.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.