రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
సాక్షి లైఫ్ : మీరు కూడా మీ బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా రోజూ రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేస్తున్నారా? ఈ రోజుల్లో చాలా మంది ఆలస్యంగా డిన్నర్ చేస్తున్నారు, కానీ ఇది ఏమాత్రం సరైన విధానం కాదని చెబుతున్నారు వైద్యనిపుణులు. రోజూ రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
జీర్ణవ్యవస్థపై ఒత్తిడి..
మన శరీరంలోని ప్రతి పని సిర్కాడియన్ రిథమ్ (శరీర గడియారం) ప్రకారం పనిచేస్తుంది. మనం రాత్రి ఆలస్యంగా ఆహారం తీసుకున్న ప్పుడు, ఈ రిథమ్ దెబ్బతినడం మొదలవుతుంది. వాస్తవానికి, రాత్రిపూట జీవక్రియ పగటిపూట అంత వేగంగా ఉండదు. అందుకే మనం రాత్రి ఆలస్యంగా ఆహారం తీసుకున్నప్పుడు, దాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, దీనివల్ల అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
బరువు పెరిగే అవకాశం..
ఆలస్యంగా డిన్నర్ చేసే వ్యక్తులలో ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం రాత్రిపూట కేలరీలు బర్న్ కావు ,శరీరం వాటిని నిల్వ చేసుకుంటుంది. దీనితో పాటు, ఆలస్యంగా తిన్న తర్వాత నిద్రపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది, ఇది డయాబెటిస్, జీవక్రియ రుగ్మతలకు దారితీస్తుంది.
నిద్ర నాణ్యత దెబ్బతింటుంది..
డిన్నర్ చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల కడుపు భారీగా అనిపిస్తుంది. నిద్రకు ఆటంకం కలుగుతుంది. అలాగే, యాసిడ్ రిఫ్లక్స్ సమస్య తలెత్తవచ్చు, దీనివల్ల ఛాతీలో మంట, అసౌకర్యం అనిపిస్తుంది. మంచి నిద్ర కోసం, భోజనం, నిద్ర మధ్య కనీసం 2-3 గంటల వ్యత్యాసం ఉండాలి.
హార్మోన్ల అసమతుల్యత..
శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ హార్మోన్లను నియంత్రిస్తుంది. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల కార్టిసాల్, ఇన్సులిన్ స్థాయిలు అసమతుల్యతకు గురవుతాయి, దీనివల్ల అలసట, మూడ్ స్వింగ్స్ ,దీర్ఘకాలికంగా హార్మోన్ల రుగ్మతలు ఏర్పడవచ్చు.
గుండె ఆరోగ్యంపై ప్రభావం..
రాత్రి ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ , కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఈ రెండు కూడా గుండె జబ్బులకు కారణం కావచ్చు.
డిన్నర్ చేయడానికి సరైన సమయం ఏది.. అంటే..?
డిన్నర్‌ను సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల మధ్య పూర్తి చేయాలి. ఇది మీ శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేయడానికి తగినంత సమయం ఇస్తుంది. రాత్రిపూట మంచి నిద్ర పొందడానికి వీలవుతుంది.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
