Severe Foot Pain : ఉదయం నిద్రలేవగానే పాదాల్లో తీవ్రమైన నొప్పా..? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం నిద్రలేచి మంచం దిగగానే పాదాల్లో చురుక్కు మని భరించలేని నొప్పి వస్తోందా..? లేదా రోజంతా పనిచేసి సాయంత్రానికి పాదాల్లో మంట, నొప్పితో బాధపడుతున్నారా? ఇది కేవలం అలసట వల్ల వచ్చే సమస్య అని కొట్టిపారేయకండి. దీని వెనుక సరైన చెప్పులు వాడకపోవడం నుంచి రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం వరకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. సకాలంలో కారణం తెలుసుకుంటే చికిత్స సులువవుతుంది. పాదాల నొప్పులకు దారితీసే ప్రధాన కారణాలు ఏమిటో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

1. ప్లాంటర్ ఫెసియాటిస్ అంటే మడమ నొప్పి..

మడమను, కాలి వేళ్లను కలిపే అరికాలిలోని మందపాటి కణజాలం (tissue)లో వాపు రావడాన్నే వైద్య పరిభాషలో 'ప్లాంటర్ ఫెసియాటిస్' అంటారు. అతిగా నడవడం, పరిగెత్తడం లేదా పాదాలకు సరైన సపోర్ట్ లేని బూట్లు వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన తర్వాత నేల మీద అడుగుపెట్టగానే తీవ్రమైన నొప్పి ఉంటుంది. కాస్త నడిచాక ఈ నొప్పి కొద్దిగా తగ్గుముఖం పడుతుంది.

2. సరైన పాదరక్షలు ఎంచుకోకపోవడం..

చాలా టైట్‌గా ఉండే షూస్, ఎత్తైన మడమలు ఉండే హై హీల్స్ లేదా మరీ ఫ్లాట్‌గా ఉండే చెప్పులు వేసుకోవడం వల్ల పాదాలపై అసహజమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల ఎముకలు, నరాలపై భారం పడి సాయంత్రానికి పాదాల్లో వాపు, నొప్పి, లేదా బొబ్బలు రావడం జరుగుతుంది. మీ పాదాల ఆకృతికి సరిపోయే, కంఫర్ట్‌గా ఉండే చెప్పులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

3. యూరిక్ యాసిడ్ పెరగడం..

ఆహారపు అలవాట్లలో లోపాల వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అనూహ్యంగా పెరుగుతాయి. ఈ యాసిడ్ చిన్నపాటి స్ఫటికాలుగా (crystals) మారి కాలి బొటనవేలు, పాదాల కీళ్ల వద్ద పేరుకుపోతుంది. దీనివల్ల రాత్రివేళల్లో అకస్మాత్తుగా పాదాలు ఎర్రబడటం, తీవ్రమైన నొప్పి, మంట వస్తుంటాయి.

4. విటమిన్ డి, బి12 లోపం..

శరీరంలో విటమిన్-డి, విటమిన్-బి12 లోపిస్తే ఎముకలు బలహీన పడతాయి. నరాలు సైతం సరిగ్గా పనిచేయవు. ఫలితంగా పాదాల్లో తిమ్మిర్లు రావడం, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, పాదాలు మంటలు పుట్టడం, చిన్న పనికే ఎప్పుడూ నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

5. అధిక బరువు, ఎక్కువసేపు నిలబడటం..

శరీర బరువు ఎక్కువగా ఉన్నా, లేదా వృత్తిరీత్యా రోజంతా నిలబడే పనిచేస్తున్నా.. శరీర భారం అంతా పాదాలపైనే పడుతుంది. దీనివల్ల పాదాల కండరాలు బాగా అలసిపోయి, అరికాళ్లలో తీవ్రమైన నొప్పి, బరువుగా అనిపించడం జరుగుతుంది. బరువును అదుపులో ఉంచుకోవడం దీనికి శాశ్వత పరిష్కారం.

6. మధుమేహం, నరాల సమస్యలు..

షుగర్ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా, దీర్ఘకాలం పాటు అదుపు తప్పి ఉండటం వల్ల పాదాలలోని నరాలు దెబ్బతింటాయి. దీనినే 'డయాబెటిక్ న్యూరోపతీ' అంటారు. దీనివల్ల పాదాల్లో మంటలు, స్పర్శ కోల్పోవడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.