Calcium Deficiency : క్యాల్షియం లోపంతో ముప్పు ఎముకలకే కాదు.. ఇంకా చాలా సమస్యలకు ఉంది..!
సాక్షి లైఫ్ : క్యాల్షియం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పాలు, ఎముకల దృఢత్వం. కానీ, మన శరీరంలో దీని పాత్ర అంతటికే పరిమితం కాదు. దంతాలు గట్టిగా ఉండాలన్నా, కండరాలు చురుగ్గా పనిచేయా లన్నా, గుండె స్పందనలు సాధారణంగా ఉండాల న్నా క్యాల్షియం చాలా అవసరం. అందుకే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇది తగిన మోతాదులో అందాలి.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
లోపిస్తే ఏమవుతుంది..?
ఆహారంలో దీర్ఘకాలం పాటు క్యాల్షియం లోపిస్తే ఆ ప్రభావం ముందుగా ఎముకలపై పడుతుంది. శరీరంలో క్యాల్షియం స్థాయిలు బాగా పడిపోవడాన్ని వైద్య పరిభాషలో 'హైపోకాల్సెమియా' అంటారు. కండరాలు పట్టేయడం, చేతులు, కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ లోపం తీవ్రమైతే ఎముకలు పెళుసుబారి చిన్న దెబ్బలకే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. వయసు పైబడిన వారిలో ఆస్టియోపోరోసిస్ ముప్పు కూడా పెరుగుతుంది.
విటమిన్-డి తోడుండాల్సిందే..!
కేవలం క్యాల్షియం ఉన్న ఆహారం తీసుకుంటే సరిపోదు. అది శరీరానికి వంటబట్టాలంటే విటమిన్-డి అత్యవసరం. మనం తిన్న ఆహారంలోని క్యాల్షియంను శరీరం గ్రహించాలంటే విటమిన్-డి సాయం చేయాలి. ఈ రెండు పోషకాలకు అవినాభావ సంబంధం ఉంది. ఒకవేళ శరీరంలో విటమిన్-డి లోపిస్తే, మీరు ఎంత క్యాల్షియం తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు.
క్యాల్షియం పుష్కలంగా లభించే ఆహారాలివే..
క్యాల్షియం కోసం కేవలం పాలపైనే ఆధారపడాల్సిన పనిలేదు. రోజూ సుమారు 28 గ్రాముల బాదం తినడం వల్ల రోజువారీ క్యాల్షియం అవసరాల్లో 6 శాతం అందుతుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి.
పాలు, పెరుగు, పనీర్ వంటివి క్యాల్షియంకు సులభమైన వనరులు. పెరుగుతున్న వయసులో ఉన్న పిల్లలతో పాటు, ఎముకల పటుత్వం కోరుకునే పెద్దలు కూడా వీటిని రోజూ డైట్లో చేర్చుకోవాలి. పాల ఉత్పత్తులు తీసుకోలేని వారు ఆకుకూరలపై దృష్టి పెట్టొచ్చు. బచ్చలికూర, క్యాబేజీ లాంటి వాటిలో క్యాల్షియం మెండుగా ఉంటుంది. అంజీర్, కమలాఫలం లాంటి పండ్లను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా తగిన మోతాదులో క్యాల్షియం పొందవచ్చు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
