Brain Health : పబ్స్‌, పార్టీలకు తరచూ వెళ్తే మెదడుకు ముప్పు తప్పదు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వారాంతం రాగానే క్లబ్‌లు, పబ్‌లు, మ్యూజిక్‌ కన్సర్ట్‌లకు వెళ్లడం యువతకు సర్వసాధారణమైపోయింది. భారీ సౌండ్‌ సిస్టమ్స్‌ మధ్య డీజే బీట్స్‌కు స్టెప్పులేయడం ఉత్సాహాన్నిచ్చినా, ఆ పెద్ద శబ్దాలు మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా మెదడుకు తీవ్ర నష్టం కలిగిస్తాయని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తు న్నారు.

చెవిలోని సున్నితమైన కణాలకు నష్టం..

సాధారణంగా 85 డెసిబెల్స్‌ కంటే ఎక్కువ శబ్దం ఉన్న వాతావరణంలో గంటల తరబడి గడపడం వల్ల చెవి లోపల ఉండే 'కోక్లియా' (Cochlea) కణాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇవి శబ్దాలను మెదడుకు చేరవేసే అత్యంత సున్నితమైన కణాలు. ఒకసారి ఇవి దెబ్బతింటే మళ్లీ కోలుకోవడం దాదాపు అసాధ్యం.

పార్టీల నుంచి ఇంటికి వచ్చాక చెవుల్లో హోరుమనే శబ్దం లేదా ఈల వేసినట్లు (Tinnitus) అనిపించడం. కొంత సమయం పాటు ఎదుటి వారు మాట్లాడేది స్పష్టంగా వినిపించకపోవడం లేదా చెవులు మూసుకుపోయినట్లు అనిపించడం. ఈ లక్షణాలను సాధారణమైన విగా కొట్టిపారేయకూడదు, ఇవి చెవి నరాలు దెబ్బతింటున్నాయన డానికి తొలి సంకేతాలు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

 ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

వినికిడి లోపంతో డిమెన్షియా ప్రమాదం..

అమెరికాకు చెందిన న్యూరోసర్జన్‌ డాక్టర్‌ రూపా జుతానీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సమస్య కేవలం చెవికి మాత్రమే పరిమితం కాదు, దీని ప్రభావం మెదడుపై తీవ్రంగా ఉంటుంది. వినికిడి సామర్థ్యం తగ్గడం అనేది 'డిమెన్షియా' మతిమరుపు వ్యాధికి దారితీసే ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రముఖ వైద్య పత్రిక 'లాన్సెట్ కమిషన్' నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మధ్య వయసులో వచ్చే వినికిడి లోపం, భవిష్యత్తులో డిమెన్షియా ముప్పును పెంచుతుంది. సుమారు 15 లక్షల మందిపై చేసిన అధ్యయనంలో.. వినికిడి సామర్థ్యం ప్రతి 10 డెసిబెల్స్ తగ్గినప్పుడల్లా, డిమెన్షియా బారిన పడే ప్రమాదం 16 శాతం మేర పెరుగుతుందని తేలింది.

రక్షణ చర్యలు తప్పనిసరి..

వినోదం కోసం వెళ్లే పార్టీలు జీవితాంతం బాధపడేలా చేయకూడ దంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. భారీ శబ్దాలు ఉండే కన్సర్ట్‌లు, డీజే క్లబ్‌లకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఇయర్‌ప్లగ్స్‌ (Earplugs) వాడండి. పెద్ద శబ్దాలు వచ్చే స్పీకర్లకు అతి దగ్గరగా నిలబడటం మానుకోండి. తరచూ చెవుల్లో శబ్దాలు వస్తున్నా, వినికిడి తగ్గినట్లు అనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈఎన్‌టీ (ENT) వైద్యులను సంప్రదించండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..

ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.