లీన్ డయాబెటిస్ అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : డయాబెటిస్ అనేది బరువు పెరగడానికి సంబంధించిన వ్యాధి అని మనం తరచుగా అనుకుంటాం. కానీ ఇది ఒక పెద్ద అపోహ. అవును చాలా సన్నగా కనిపించే వారు కూడా మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారు. దీనిని లీన్ డయాబెటిస్ అని పిలుస్తారు. దాని వెనుక కొన్ని నిర్దిష్ట కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఎముకల దృఢత్వం కోసం ఎలాంటి హెల్తీ ఫుడ్ అవసరం అంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
జంక్ ఫుడ్ తినేవారిలో సన్నగా ఉన్నవారు కూడా డయాబెటీస్ బారీన పడే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. బాల్యంలో పోషకాహార లోపం కూడా మధుమేహ వ్యాధికి ప్రధాన కారణం కావచ్చని వారు అంటున్నారు. ఊబకాయం కారణంగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని భావిస్తారు. అధిక బరువు ఉన్నవారు మాత్రమే ఈ వ్యాధి బారిన పడుతున్నారని సాధారణ నమ్మకం, కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంటుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
కొన్నిసందర్భాల్లో సన్నగా ఉన్నవారికి కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధనలు సైతం నివేదిస్తున్నాయి. నిద్ర ,ఒత్తిడి , ప్రభావాలు, కండర ద్రవ్యరాశి లేకపోవడం, బయట సన్నగా ఉండడం, లోపల కొవ్వు కలిగి ఉండడం, జన్యుపరమైన అంశాలు డయాబెటీస్ రావడానికి ప్రధాన కారకాలని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
