హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?

షేర్ చేయండి:
హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?

సాక్షి లైఫ్: హిమోఫిలియా అనేది రక్తస్రావానికి సంబంధించిన రుగ్మత, దీని వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రక్రియ ఆగిపోతుంది. ఇది చాలా తీవ్రమైన సమస్య అయినప్పటికీ, ప్రజలలో దీనిపై అవగాహన చాలా తక్కువగా ఉంది. తీవ్రమైన రక్తస్రావం రుగ్మత హీమోఫిలియా చికిత్సకు చాలా ఖర్చవుతుంది. సీఎస్ఎల్ బెహ్రింగ్ అనే బయోఫార్మాస్యూటికల్ కంపెనీ తయారుచేసిన మందులను హీమోఫిలియా B జన్యు చికిత్సకు  ఆమోదించారు. ఇది రోగులను సాధారణ చికిత్సల నుంచి విముక్తి చేస్తుంది. కానీ ఒక మోతాదుకు రూ. 35లక్షలు ఖర్చవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం.

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

 జీవిత కాలం ఎంత..?

రోగులకు తగిన చికిత్స అందుతుందా లేదా అనేదానిపై ఆధారపడి హీమోఫిలియాలో ఆయుర్దాయం మారుతూ ఉంటుంది. సరైన చికిత్స అందక చాలా మంది రోగులు యుక్తవయస్సు రాకముందే మరణిస్తున్నారు. సరైన చికిత్సతో, ఆరోగ్యవంతమైన పురుషుల కంటే ఆయుర్దాయం 10 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది.

 హిమోఫిలియా రోగులకు ఉత్తమమైన ఆహారం ఏది..?

హిమోఫీలియా ఉన్నవారు ఐరన్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలలో ఆకుకూరలు, మాంసం, కోడిగుడ్లు, బచ్చలికూర, బ్రోకలీ,  బీన్స్, తృణధాన్యాలు ,ఎండుద్రాక్ష వంటివి ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. 

 హిమోఫిలియాతో బాధపడేవారు ఏమి చేయకూడదు..?

ఫుట్‌బాల్, హాకీ లేదా రెజ్లింగ్ వంటి వాటికీ హిమోఫిలియా ఉన్నవారు దూరంగా ఉండాలి. కొన్ని నొప్పి నివారణ మందులను నివారించాలి.   ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్ ,అడ్విల్, మోట్రిన్ వంటి మందులు రక్తస్రావానికి కారణం అవుతాయి. కాబట్టి వీటి బదులుగా, ఎసిటమైనోఫెన్ ,టైలెనాల్ వంటివి ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.  

హిమోఫిలియాకు చికిత్స ఏమిటి..?

హిమోఫిలియా చికిత్సకు ఉత్తమ మార్గం రక్తం గడ్డకట్టే కారకాలను భర్తీ చేయడం ద్వారా రక్తం గడ్డకడుతుంది. ఇది సాధారణంగా ఒక వ్యక్తి సిరలోకి క్లాటింగ్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్స్ అని పిలిచే చికిత్స, ఉత్పత్తులను ఇంజెక్ట్ చేయడం ద్వారా జరుగుతుంది.

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.