Daily Habits : ఈ చిన్నచిన్న అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మీరు రోజుకు కనీసం 8 గ్లాసుల శుభ్రమైన నీరు తాగుతు న్నారా? ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగే అలవాటు ఉందా? ప్రతిరోజూ ఉదయం అల్పాహారం (breakfast) మానకుండా తీసుకుంటున్నారా..? మీ భోజనంలో తాజా పండ్లు మరియు ఆకుకూరలకు తగిన స్థానం ఇస్తున్నారా..? చక్కెర,ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గిస్తున్నారా..? బయట దొరికే జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉంటున్నారా..? ఆహారాన్ని బాగా నమిలి, నెమ్మదిగా తింటున్నారా..?

రాత్రి భోజనం నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందే ముగిస్తున్నారా..?ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా ఏదైనా వ్యాయామం చేస్తున్నారా..? రాత్రిపూట కనీసం 7 నుండి 8 గంటల పాటు గాఢ నిద్ర పోతున్నారా..? ఉదయం లేవగానే కొద్దిసేపు సూర్యరశ్మి తగిలేలా బయట గడుపుతున్నారా..? పని మధ్యలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి నడుస్తున్నారా..? లిఫ్ట్‌కు బదులుగా వీలైనప్పుడల్లా మెట్లు ఎక్కడానికి ప్రాధాన్యత ఇస్తున్నారా..?

మీ ఎత్తుకు తగిన బరువును (BMI) నియంత్రణలో ఉంచుకుంటున్నారా? నిద్రపోయే ముందు కనీసం అరగంట ముందే ఫోన్, టీవీ స్క్రీన్‌లను ఆపివేస్తున్నారా..? ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయి, ఒకే సమయానికి నిద్రలేచే అలవాటు ఉందా..? మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజూ కొద్దిసేపు ధ్యానం లేదా ప్రాణాయామం చేస్తున్నారా..? చిన్నచిన్న విషయాలకు ఆందోళన పడకుండా సానుకూలంగా ఆలోచిస్తున్నారా..? ప్రతిరోజూ కుటుంబ సభ్యులు,స్నేహితులతో కొంత సమయం సంతోషంగా గడుపుతున్నారా..?

 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

మనస్ఫూర్తిగా నవ్వడానికి ప్రతిరోజూ సమయం కేటాయిస్తున్నారా? పొగతాగడం, మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటున్నారా..? టీ, కాఫీ వంటి కెఫీన్ పానీయాలను రోజుకు రెండు కప్పుల లోపే పరిమితం చేస్తున్నారా..? శరీరానికి మనసుకు విశ్రాంతినిచ్చేలా వారానికి ఒకరోజైనా మీకు ఇష్టమైన వ్యాపకాలతో గడుపుతున్నారా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణుల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.