Ayurvedic Herbs : మహిళల ఆరోగ్యానికి ఆహారంలో ఈ 3 ఆయుర్వేద మూలికలు చేర్చుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నేటి ఉరుకులు పరుగుల జీవనశైలిలో మహిళలు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత, తరచుగా నీరసం, అలసట, ఎముకల బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటివి వారి రోజువారీ పనులపై ప్రభావం చూపుతున్నాయి. సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు కొన్ని శక్తివంతమైన ఆయుర్వేద మూలికలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

1. సఫేద్ ముస్లి (Safed Musli)..

ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించే ఔషధ మొక్కల్లో సఫేద్ ముస్లి ఒకటి. శారీరక బలాన్ని, శక్తిని పెంపొందించడానికి దీనిని సంప్రదాయబద్ధంగా వాడుతుంటారు.

ప్రయోజనమేంటి..?  

 ఇందులోని సహజ సిద్ధమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు శారీరక నీరసం, అలసటను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో స్టామినాను పెంచడంతో పాటు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కణాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఎలా తీసుకోవాలి..?

సఫేద్ ముస్లిని పొడి రూపంలో లేదా ఆయుర్వేద నిపుణుల సూచన మేరకు తగిన మోతాదులో తీసుకోవాలి.

2. బ్రాహ్మీ (Brahmi)..

ఇంటి బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్ల మధ్య నలిగిపోయే నేటి మహిళలకు మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడానికి ఆయుర్వేదంలో బ్రాహ్మీని ఒక అద్భుతమైన ఔషధంగా పరిగణిస్తారు.

ప్రయోజనమేంటి..?  

 ఇది మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా మానసిక అలసట, ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఎలా తీసుకోవాలి..?

 బ్రాహ్మీని పొడి లేదా క్యాప్సూల్స్ రూపంలో వైద్యుల సలహా ప్రకారం ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

3. ఉసిరి (Amla)..

ఆయుర్వేదంలో ఉసిరికి ప్రత్యేక స్థానం ఉంది. విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరి మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ప్రయోజనమేంటి..?  

 ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని (immune system) బలోపేతం చేస్తుంది. ఇందులోని విటమిన్-సి శరీరం ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది, తద్వారా రక్తహీనత సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండేందుకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

ఎలా తీసుకోవాలి..?

 తాజా ఉసిరికాయలు, ఉసిరి రసం, పచ్చడి లేదా చూర్ణం రూపంలో మితంగా తీసుకోవచ్చు. ఆయుర్వేద మూలికలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, గర్భిణులు, పాలిచ్చే తల్లులు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న మహిళలు వీటిని ప్రారంభించే ముందు తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకోవాలి.

 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.