శరీరం డీహైడ్రేట్ కు గురైందా..? లేదా..? అనేది ఎలా తెలుస్తుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శరీరంలో నీరు లేకపోవడం కారణంగా చర్మం పొడిబారడం, పెదవులు ఎండిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. శరీరంలో నీరు లేకపోవడం వల్ల ఛాతిలో కొంచెం మంట, ఆమ్లత్వం లేదా కడుపులో అసౌకర్యంగా కూడా అనిపించవచ్చు.

శరీరంలో నీటి కొరత ఏర్పడడం వల్ల కండరాలలో నొప్పి, తిమ్మిర్లు  వంటి సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల నిరంతరం తలనొప్పి కూడా  వస్తుంటుంది. శరీరంలో తగిన మోతాదులో నీరు లేకపోతే తగినంత లాలాజల ఉత్పత్తి అవ్వదు. దీని వల్ల నోరు దుర్వాసన వస్తుంది. 

లాలాజల ఉత్పత్తి తగ్గితే నోటిలో బ్యాక్టీరియా సంఖ్య పెరిగి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. మూత్రం రంగు కాలక్రమేణా ముదురు లేదా పసుపు రంగులోకి మారినట్లయితే, అది డీహైడ్రేషన్ కు సంకేతంగా భావించాలి.

 ఈ లక్షణాలు ఉన్న వారు రోజువారీ తాగే నీటి మోతాదును కాస్త పెంచాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా ఉంటుంది. ప్రతిరోజూ నీరు ఎంత తాగాలనే విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.