Vitamin C Benefits : కేవలం రోగనిరోధక శక్తే కాదు.. విటమిన్ ‘సి’తో మరెన్నో హెల్త్ బెనిఫిట్స్..!
సాక్షి లైఫ్ : శరీరానికి రోగనిరోధక శక్తి (immunity) పెరగాలంటే విటమిన్ సి కావాలని అందరికీ తెలుసు. ముఖ్యంగా కరోనా సమయం నుంచి దీని వాడకం మరింత పెరిగింది. అయితే, విటమిన్ సి ప్రయోజనాలు కేవలం జలుబు, దగ్గుల నుంచి రక్షించడానికే పరిమితం కాలేదు. చర్మ సౌందర్యం పెంపొందించడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, రక్తహీనతను నివారించడం వంటి ఎన్నో కీలక ప్రక్రియలలో ఇది తెరవెనుక ఉండి అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతకీ విటమిన్-సి శరీరానికి ఎందుకు అంత ముఖ్యం..? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
1. చర్మ సౌందర్యానికి, ఎముకల పటిష్టతకు ‘కొల్లాజెన్’..
శరీరంలో ‘కొల్లాజెన్’ అనే ప్రోటీన్ ఉత్పత్తి కావడానికి విటమిన్-సి అత్యంత అవసరం. ఈ కొల్లాజెన్ మన చర్మం, ఎముకలు, రక్తనాళాలు, కండరాలు, స్నాయువుల (ligaments) నిర్మాణాన్ని బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి తగినంత విటమిన్ సి అందినప్పుడే కొత్త కణాలు పుట్టుకొస్తాయి, దెబ్బతిన్న కణజాలాలు వేగంగా మరమ్మతుకు గురవుతాయి. దీనివల్ల చర్మంపై ముడతలు తగ్గి, యవ్వనంగా కనిపిస్తారు.
2. గాయాలను వేగంగా నయం చేస్తుంది..
శరీరానికి ఏదైనా చొరబాటు లేదా చర్మంపై గాయాలు అయినప్పుడు, అక్కడ కొత్త చర్మం ఏర్పడటానికి కొల్లాజెన్ అవసరమవుతుంది. విటమిన్-సి కొల్లాజెన్ విడుదలను వేగవంతం చేయడం ద్వారా గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులు త్వరగా కోలుకోవడానికి కూడా విటమిన్ సి ఎంతగానో దోహదపడుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి.
3. రక్తహీనత (Anemia)కు చెక్..!
శరీరంలో ఐరన్ లోపం వల్ల చాలామంది రక్తహీనతతో బాధపడు తుంటారు. మనం తినే ఆకుకూరలు, పప్పుధాన్యాల ద్వారా లభించే ‘నాన్ హేమ్ ఐరన్’ను శరీరం సులభంగా గ్రహించలేదు. అయితే, ఈ ఆహార పదార్థాలతో పాటు విటమిన్ సి తీసుకున్నప్పుడు, అది ఐరన్‌ను శరీరం త్వరగా శోషించుకునేలా చేస్తుంది. అందుకే నిపుణులు పప్పులు, ఆకుకూరలపై నిమ్మరసం పిండుకుని తినాలని సలహా ఇస్తుంటారు.
4. గుండెకు రక్షణ కల్పించే ‘యాంటీ ఆక్సిడెంట్’..
విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో వయసు పెరిగే కొద్దీ లేదా కాలుష్యం వల్ల విడుదలయ్యే ‘ఫ్రీ రాడికల్స్’ కణాలను దెబ్బతీస్తాయి. దీనివల్ల ఆక్సిడేటివ్ ఒత్తిడి పెరిగి దీర్ఘకాలిక వ్యాధులు, ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. విటమిన్-సి ఈ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాలకు రక్షణ కల్పించడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
విటమిన్ సి లభించే సహజ వనరులు ఇవే..
ఈ విటమిన్‌ను శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు, అలాగే నిల్వ ఉంచుకోలేదు. కాబట్టి రోజూ తీసుకునే ఆహారం ద్వారానే దీనిని పొందాలి. నారింజ, బత్తాయి, నిమ్మ, జామ, కివి, ఉసిరి, స్ట్రాబెర్రీ.. వంటి పండ్లు. క్యాప్సికమ్, బ్రోకలీ, ఆకుకూరలు, టమోటాలు.. వంటి కూరగాయలు.
విటమిన్ సి అనేది కేవలం ఒక సాధారణ విటమిన్ కాదు, మన శరీరానికి అది ఒక శ్రీరామరక్ష. కాబట్టి, సప్లిమెంట్ల రూపంలో కాకుండా నిత్యం తాజా పండ్లు, కూరగాయలను సమతుల్యంగా తీసుకోవడం ద్వారా ఈ పోషకాన్ని సహజసిద్ధంగా అందుకోవచ్చు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
