Calcium Deficiency : ఎముకల బలహీనతకు క్యాల్షియం లోపమే కాదు.. ఈ వ్యాధులు కూడా కారణమే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఎముకలు అరిగిపోవడం, కీళ్లు పట్టుకుపో వడం అనగానే వయసు పైబడటం లేదా క్యాల్షియం, విటమిన్-డి లోపమే కారణమని చాలామంది అనుకుంటారు. కానీ, మన శరీరంలో దాగి ఉన్న కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఎముకలను లోపలి నుంచి గుల్ల చేస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం పోషకాల లేమి మాత్రమే కాకుండా, పలు రకాల అనారోగ్య సమస్యలు సైతం 'ఆస్టియోపోరోసిస్' (Osteoporosis) ముప్పును పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాం..

ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల సాంద్రత తగ్గి, పెళుసుగా మారడం. ఈ వ్యాధికి తొలిదశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కేవలం చిన్న దెబ్బ తగిలినప్పుడు ఎముకలు విరిగితే (fracture) తప్ప సమస్య తీవ్రత బయటపడదు. వయసుతో పాటు పలు వ్యాధులు కూడా ఎముకల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

1. థైరాయిడ్ (Hyperthyroidism)..

శరీరంలో థైరాయిడ్ హార్మోన్ మోతాదు కంటే ఎక్కువగా ఉత్పత్తి అయ్యే పరిస్థితిని 'హైపర్‌థైరాయిడిజం' అంటారు. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల.. పాత ఎముకలు అరిగిపోయి, ఆ స్థానంలో కొత్త ఎముక కణాలు ఏర్పడే పునర్నిర్మాణ ప్రక్రియ (Bone remodeling) దెబ్బతింటుంది. ఈ సమస్య దీర్ఘకాలం పాటు ఉంటే ఎముకల సాంద్రత వేగంగా పడిపోయి ఫ్రాక్చర్ల ముప్పు పెరుగుతుంది.

2. మధుమేహం (Diabetes)..

డయాబెటిస్ నాడీ వ్యవస్థను, కళ్లను దెబ్బతీయడంతో పాటు ఎముకలనూ బలహీనపరుస్తుంది. టైప్-1, టైప్-2 మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎముకల్లోని కొల్లాజెన్ ప్రోటీన్‌లో 'అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్' (AGEs) అనే రసాయనాలు పేరుకుపోతాయి. దీంతో ఎముకలు సహజత్వాన్ని కోల్పోయి అత్యంత పెళుసుగా మారతాయి.

3. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis)..

ఇది కీళ్లలో వాపును, విపరీతమైన నొప్పిని కలిగించే ఆటో ఇమ్యూన్ రోగనిరోధక వ్యవస్థ తనను తాను దాడి చేసుకోవడం, వ్యాధి. నిరంతర కీళ్ల నొప్పుల వల్ల శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోతుంది. దీనికి తోడు వాపును, నొప్పిని తగ్గించడానికి వాడే స్టెరాయిడ్ మందులు దీర్ఘకాలంలో ఎముకల సాంద్రతను కరిగించేస్తాయి.

4. జీర్ణకోశ సమస్యలు (Digestive Disorders)..

ఉదరకుహర వ్యాధి (Celiac Disease), క్రోన్ వ్యాధి (Crohn's Disease) లాంటి పేగు సమస్యలు ఉన్నవారిలో జీర్ణశక్తి దెబ్బతింటుంది. వీరు ఎంత మంచి పౌష్టికాహారం తీసుకున్నా.. పేగులు ఆ ఆహారంలోని క్యాల్షియం, విటమిన్-డి వంటి ముఖ్యమైన పోషకాలను శోషించుకోలేవు (Malabsorption). ఫలితంగా ఎముకలకు పోషణ అందక బలహీనపడతాయి.

5. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు (Chronic Kidney Disease)..

ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్-డి సమతుల్యంగా ఉండాలి. వీటిని కంట్రోల్ చేసేది మూత్రపిండాలే. కిడ్నీల పనితీరు మందగించినప్పుడు ఈ మినరల్స్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. దీంతో రక్తంలో క్యాల్షియం స్థాయిలను పెంచడానికి శరీరం.. ఎముకల నుంచి క్యాల్షియంను లాగేసుకుంటుంది.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.