videos
సైనసైటిస్ ఎన్ని రకాలున్నాయంటే..?
సాక్షి లైఫ్ : సైనస్ సమస్య ఉన్నవారికి తరచుగా ముక్కు కారుతున్న సమయంలో ఆవిరి తీసుకోవడం వల్ల కొంతమేర ఉపశమనం కలుగుతుంది. నాసికా రంధ్రాలు మూసుకుపోయినట్లు అనిపించినా కూడా ఆవిరి పట్టడంవల్ల సమస్య తాత్కాలికంగా కొంత వరకు పరిష్కారం అవుతుంది. మద్యం సేవించడం వల్ల సైనస్ సమస్యలు మరింతగా పెరుగుతాయి. కాబట్టి పొరపాటున కూడా మద్యం తీసుకోకపోవడం మంచిది. చల్లని గాలి, చల్లని నీరు, చల్లని పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు చల్లని నీటితో కూడా తలస్నానం చేయవద్దని వారు చెబుతున్నారు. అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? ఈ రెండిటిలో ఏది తీవ్రమైంది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డా. మొయినుద్దీన్ మహమ్మద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..
