Jaggery Vs Sugar : పంచదారకు బదులు బెల్లం వాడుతున్నారా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : భారతీయ వంటకాల్లో, ఆయుర్వేదంలో బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మధ్యకాలంలో ఆరోగ్య స్పృహ పెరగడంతో చాలామంది తెల్లటి పంచదారకు (sugar) బదులుగా బెల్లం వాడటం ప్రారంభించారు. అయితే, చక్కెర స్థానంలో బెల్లం వాడటం నిజంగానే ప్రయోజనకరమా..? దీనివల్ల మన శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి..? తెలుసుకుందాం..

సాధారణంగా పంచదారను రిఫైన్ చేసే క్రమంలో అందులో ఉండే పోషకాలన్నీ నశించిపోతాయి. కేవలం తీపి మాత్రమే మిగులుతుంది. కానీ, బెల్లంలో ఇనుము (iron) మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు నిక్షిప్తమై ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతారు.

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

బెల్లం.. ప్రయోజనాలు ఎన్నో..

జలుబు, గొంతు నొప్పికి దివ్యౌషధం: వాతావరణ మార్పుల వల్ల వచ్చే దగ్గు, జలుబు, గొంతునొప్పిని తగ్గించడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా తులసి ఆకుల రసంలో బెల్లం కలుపుకుని రోజుకు మూడుసార్లు తీసుకుంటే గొంతులో మంట, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. మిరియాలు, శొంఠి లేదా నువ్వులతో కలిపి బెల్లం తిన్నా శ్వాసకోశ సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.

 భోజనం చేసిన తర్వాత ఓ చిన్న బెల్లం ముక్క తినే అలవాటు మన పెద్దలకు ఉంటుంది. ఇది అజీర్తిని నివారించి, తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన హానికరమైన వ్యర్థాలను (toxins) బయటకు పంపడంలో బెల్లం సహజమైన 'క్లెన్సర్'గా పనిచేస్తుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరిచి, లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది.

నీరసంగా లేదా అలసిపోయినట్లు ఉన్నప్పుడు కొద్దిగా బెల్లం తింటే శరీరానికి తక్షణమే శక్తి అందుతుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి కావాల్సిన ఎనర్జీని వెంటనే బూస్ట్ చేస్తాయి. బెల్లం ఆరోగ్యానికి మంచిదే కదా అని మోతాదుకు మించి తినకూడదు. ఇందులో కూడా క్యాలరీలు ఉంటాయి. ఇది చక్కెర రూపాంతరమే కాబట్టి, పరిమితంగా తీసుకున్నప్పుడే దీనిలోని పూర్తి ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.