జుట్టు, చర్మ సంరక్షణకు విటమిన్ "ఇ" చేసే మేలు తెలుసా..?  

సాక్షి లైఫ్ : మనం ఏది తిన్నా అందులో విటమిన్లు, మినరల్స్ సహా ఎన్నో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. మన శరీర అభివృద్ధికి ,ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి పోషకాలు చాలా ముఖ్యమైనవి. అయితే, ఆరోగ్యంతో పాటు, కొన్ని విటమిన్లు, మినరల్స్ మన చర్మం, జుట్టుకు కూడా అవసరం. విటమిన్ "ఇ" వీటిలో ఒకటి. ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి, జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతే కాదు, ఇది కంటి ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. చర్మానికి విటమిన్ "ఇ" వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలో విటమిన్ "ఇ" కీలక పాత్ర పోషిస్తుంది. చాలామందికి ఇప్పటికీ దాని ప్రయోజనాల గురించి తెలియదు. అవేంటంటే..?  

ఇది కూడా చదవండి.. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?

ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? 

ఇది కూడా చదవండి.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి.. వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు


ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని నివారించడంలో.. 

విటమిన్ "ఇ" అనేది యాంటీఆక్సిడెంట్లకు మూలం. ఇది అతి నీలిలోహిత  కిరణాల వల్ల కలిగే ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గిస్తుంది. అంతేకాదు సన్‌బర్న్ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. విటమిన్ "ఇ" సన్‌బర్న్ వల్ల కలిగే దురద నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

 ఎల్లో నెయిల్ సిండ్రోమ్‌.. 

విటమిన్ "ఇ" ఎల్లో నెయిల్ సిండ్రోమ్‌ను నివారిస్తుంది. అంతేకాదు పొడి చర్మాన్ని, పొరలుగా ఉండే చర్మాన్ని నిరోధించడానికి లేదా చికిత్స చేయడానికి సహాయపడుతుంది. దీనిని మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. విటమిన్ "ఇ"ని అనేక మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లలో కూడా ఉపయోగిస్తారు.

 కొత్త చర్మ కణాల పునరుత్పత్తి.. 

విటమిన్ "ఇ" కొత్త చర్మ కణాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. గోధుమ రంగు మచ్చలను తొలగిస్తుంది. రెగ్యులర్‌గా అప్లై చేస్తే స్ట్రెచ్ మార్క్స్‌ని తగ్గించుకోవచ్చు. విటమిన్ "ఇ"లో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలోనూ, ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మంపై ఫ్రీ రాడికల్స్  హానికరమైన ప్రభావాలను నియంత్రిస్తాయి.  

 

ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి.. వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : vitamin-e vitamin-e-capsules-for-skin vitamin-e-benefits benefits-of-vitamin-e vitamin-e-for-hair vitamin-e-capsule-for-hair vitamin-e-for-skin vitamin-e-capsules-for-hair vitamin-e-for-face vitamin-e-oil-for-hair benefits-and-uses-of-vitamin-e-capsule-for-hair-and-skin vitamin-e-capsule-for-face vitamin-e-for-hair-growth benefits-of-vitamin-e-for-hair benefits-of-vitamin-e-for-skin how-to-use-vitamin-e-capsules-for-hair-growth

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com