Breast Pain : పీరియడ్స్ సమయంతో సంబంధం లేకుండా రొమ్ములో నొప్పి వస్తోందా..?
సాక్షి లైఫ్ : రొమ్ములో ఏదైనా కొత్త గడ్డ లేదా గట్టిదనం ఏర్పడినట్లు అనిపిస్తోందా? చంకల కింద ఏవైనా వాపులు లేదా గడ్డలు తగిలాయా? రొమ్ము ఆకారం లేదా పరిమాణంలో అకస్మాత్తుగా ఏవైనా మార్పులు గమనించారా? రొమ్ము చర్మం మందంగా మారడం లేదా గుంతలు పడటం జరుగుతోందా? చర్మం నారింజ పండు తొక్కలా కనిపిస్తోందా? రొమ్ముపై చర్మం ఎర్రగా కందిపోవడం లేదా మంటగా అనిపించడం ఉందా? స్పర్శించినప్పుడు రొమ్ము ప్రాంతంలో అసాధారణమైన వేడి అనిపిస్తోందా?
ఒక రొమ్ము, మరొక దానికంటే భిన్నంగా వాచినట్లు కనిపిస్తోందా? చనుమొనలు లోపలికి లాగినట్లు లేదా కుచించుకుపోయినట్లు ఉన్నాయా? చనుమొనల చుట్టూ ఉన్న చర్మం పొలుసులుగా రాలడం లేదా పొడిబారడం జరుగుతోందా? నిపుల్స్ వద్ద విపరీతమైన దురద లేదా దద్దుర్లు వస్తున్నాయా? పాలిచ్చే సమయం కాకపోయినా చనుమొనల నుంచి ఏదైనా ద్రవం కారుతోందా? నిపుల్స్ నుంచి వచ్చే ద్రవంలో రక్తం ఆనవాళ్లు ఉన్నాయా? ఆ ద్రవం పసుపు లేదా ఆకుపచ్చ రంగులో దుర్వాసనతో వస్తోందా?
చనుమొనల ఆకృతిలో లేదా దిశలో ఏదైనా కొత్త మార్పు కనిపిస్తోందా? బ్రా వేసుకున్నప్పుడు విపరీతమైన అసౌకర్యం లేదా మంట కలుగుతోందా? ఛాతీ కండరాల లోపల ఏదో లాగుతున్నట్లు లేదా బరువుగా అనిపిస్తోందా? రొమ్మును తాకినప్పుడు లేదా నొక్కినప్పుడు తీవ్రమైన నొప్పి వస్తోందా? కాలర్ బోన్ ,మెడ కింది ఎముక చుట్టుపక్కల అకారణంగా నొప్పి లేదా వాపు ఉందా?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
చర్మంపై కంటికి కనిపించే విధంగా నరాలు ఉబ్బినట్లు ఉన్నాయా? రొమ్ము భాగంలో ఎక్కడైనా పుండు పడి, ఎన్ని రోజులైనా మానకుండా ఉందా?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
