Vitamin D Affect Fertility : సంతాన సాఫల్యతపై విటమిన్‌-డి ప్రభావం ఎలా ఉంటుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : విటమిన్‌-డి అనగానే ఎముకల దృఢత్వానికి, శరీరంలో క్యాల్షియం వినియోగానికి మాత్రమే ఉపయోగపడుతుందని చాలామంది భావిస్తుంటారు. దీన్ని 'సన్‌షైన్ విటమిన్' అని కూడా అంటారు. మన దేశంలో దాదాపు ఏడాది పొడవునా సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తున్నప్పటికీ, చాలామంది విటమిన్‌-డి లోపంతో బాధపడుతుండటం ఆందోళన కలిగించే విషయం. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ లోపం ఎముకలనే కాకుండా స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం (fertility) పైనా తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

 

మహిళల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి..?

విటమిన్-డి లోపం నేరుగా వంధ్యత్వానికి కారణం కాకపోయినా, సంతానోత్పత్తి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విటమిన్-డి శరీరంలో ఒక హార్మోన్‌లా పనిచేస్తూ.. ప్రొజెస్టెరాన్, ఈస్ట్రాడియోల్, ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ వంటి సంతానోత్పత్తి హార్మోన్లను నియంత్రిస్తుంది.

నెలసరి సక్రమంగా రావడానికి, అండాశయం నుంచి అండం విడుదలయ్యే ప్రక్రియ (process of ovulation)కు ఇది అత్యవసరం. విటమిన్-డి స్థాయిలు పడిపోతే, యాంటీ-ముల్లెరియన్ హార్మోన్ (Anti-Mullerian Hormone ) స్థాయిలు కూడా పడిపోయి అండాల నాణ్యత, సంఖ్య క్షీణిస్తాయి. పీసీఓఎస్ (PCOS) లాంటి సమస్యలకూ ఇది కారణమవుతుంది.

పురుషులపైనా తీవ్ర ప్రభావం..

విటమిన్-డి లోపం పురుషుల్లో వీర్యకణాల నాణ్యత, కదలికల (Motility) పై తీవ్ర ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. శుక్రకణాలు చురుగ్గా కదలడానికి, ఈదడానికి అవసరమైన క్యాల్షియం సిగ్నలింగ్‌ను విటమిన్-డి నియంత్రిస్తుంది. దీని లోపం వల్ల శుక్రకణాల ఉత్పత్తి (spermatogenesis), టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయులు తగ్గిపోయి సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి.

లోపాన్ని ఎలా అధిగమించాలి..?

శరీరంలో విటమిన్-డి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి సాధారణ రక్తపరీక్ష చేయించుకోవాలి. లోపం ఉన్నట్లు తేలితే ఉదయం, సాయంత్రం వేళల్లో ఎండలో కాసేపు గడపడం అలవాటు చేసుకోవాలి. కోడిగుడ్డు సొన, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. జీవనశైలి మార్పులతో పాటు అవసరమైతే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లు వాడటం మంచిది.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.