Thyroid Disease : గర్భధారణపై థైరాయిడ్ ప్రభావం ఎలా ఉంటుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గర్భం దాల్చాలని ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే, ముందుగా వైద్యులను సంప్రదించి ఆరోగ్య స్థితిగతులను పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. బయటకు అంతా సవ్యంగానే కనిపిస్తున్నా, లోపల దాగి ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలు గర్భధారణకు అడ్డంకిగా మారవచ్చు. అందులో ప్రధానమైనది థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత.

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గర్భధారణపై థైరాయిడ్ ప్రభావం..

మన మెడ కింది భాగంలో ఉండే చిన్న థైరాయిడ్ గ్రంథి, శరీర జీవక్రియలతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థను కూడా నియంత్రిస్తుంది. గర్భం దాల్చాలంటే మహిళల్లో నెలసరి సక్రమంగా ఉండటంతో పాటు అండోత్సర్గం (Ovulation) అండాశయం నుంచి అండం విడుదలయ్యే ప్రక్రియ..కచ్చితమైన సమయంలో జరగాలి. థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు ఈ రెండు ప్రక్రియలకు అంతరాయం కలుగుతుంది.

హార్మోన్ల హెచ్చుతగ్గులతో వచ్చే చిక్కులు..

హైపోథైరాయిడిజం (Hypothyroidism)..థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయని ఈ స్థితి వల్ల రుతుక్రమం తప్పుతుంది. అండోత్సర్గం సరిగా జరగదు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే గర్భం దాల్చడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ గర్భం వచ్చినా.. అబార్షన్లు (miscarriage) లేదా నెలలు నిండకుండానే ప్రసవం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

హైపర్ థైరాయిడిజం (Hyperthyroidism)..

 ఈ స్థితిలో థైరాయిడ్ హార్మోన్లు అవసరానికి మించి ఉత్పత్తి అవుతాయి. ఇది కూడా రుతుక్రమాన్ని మార్చేసి, గర్భధారణకు ఆటంకం కలిగిస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు దీనిని నియంత్రణలో ఉంచుకోకపోతే తల్లీబిడ్డల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పిల్లల కోసం ప్లాన్ చేసుకునే ముందే కచ్చితంగా థైరాయిడ్ పరీక్ష (Thyroid Profile Test) చేయించుకోవాలి. రిపోర్టులలో ఏవైనా తేడాలు ఉంటే ముందుగా దానికి చికిత్స తీసుకోవాలి. మీకు నెలసరి సమస్యలు ఉన్నా, గర్భం దాల్చడంలో జాప్యం జరుగుతున్నా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్ చాలా అవసరం. కాబట్టి రోజువారీ ఆహారంలో అయోడిన్ కలిగిన ఉప్పును తగిన మోతాదులో వాడాలి. వైద్యుల సూచన, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎటువంటి సప్లిమెంట్లు లేదా ఇతర మందులు సొంతంగా వాడకూడదు.

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.