Pregnancy time : గర్భధారణ సమయంలో వ్యాయామం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో తేలికపాటి వ్యాయామాలు చేయడం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే వర్కవుట్స్ చేసే క్రమంలో శరీరంపై తీవ్ర ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. వ్యాయామం చేస్తున్నప్పుడు పలు హెచ్చరిక సంకేతాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. తల తిరగడం, శ్వాసలో ఇబ్బంది.. వర్కవుట్స్ చేసేటప్పుడు కళ్లు తిరగడం, అసాధారణంగా ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి విశ్రాంతి తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

రక్తస్రావం లేదా ద్రవాలు కారడం..

వర్కవుట్స్ సమయంలో యోని నుంచి రక్తస్రావం అవ్వడం లేదా నీటి లాంటి ద్రవాలు లీక్ అవ్వడం లాంటివి కనిపిస్తే దాన్ని సాధారణ సమస్యగా కొట్టిపారేయకండి. ఇలా జరిగితే తక్షణమే వైద్యులను సంప్రదించడం అత్యవసరం.

ఛాతీనొప్పి, విపరీతమైన తలనొప్పి..

 ఛాతీలో నొప్పిగా అనిపించినా, తీవ్రమైన తలనొప్పి వేధించినా, కండరాల బలహీనత వల్ల శరీర సమతుల్యత (balance) తప్పుతు న్నట్లు అనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యాయామాన్ని నిలిపివేయాలి.

కడుపులో నొప్పి, పిక్కల వాపు.. 

 కడుపులో తీవ్రమైన నొప్పి రావడం, కండరాలు పట్టేయడం లేదా కాలి పిక్కల్లో అకస్మాత్తుగా వాపు, నొప్పి వస్తే అది రక్తం గడ్డకట్టడానికి (blood clot) సంకేతం కావచ్చు. ఈ సమయంలో వాపు ఉన్న చోట ఎట్టి పరిస్థితుల్లోనూ మసాజ్ చేయకూడదు.

శరీరం వేడెక్కడం, వికారం..

 విపరీతమైన అలసట, శరీరం సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కడం లేదా వికారంగా అనిపిస్తే.. అది మీ శరీరంపై పడుతున్న తీవ్రమైన ఒత్తిడికి సూచన. వెంటనే రిలాక్స్ అవ్వాలి.

సురక్షితమైన వ్యాయామం కోసం జాగ్రత్తలు..

నడక, ఈత, ప్రెగ్నెన్సీ యోగా లాంటివి ప్రారంభించే ముందు తప్పనిసరిగా మీ వైద్యుల సలహా, సూచనలు తీసుకోవాలి. వర్కవుట్స్‌కి ముందు, ఆ తర్వాత తగినంత నీరు తాగుతూ శరీరంలో డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా చూసుకోవాలి.

వ్యాయామం చేస్తున్నప్పుడు పక్కవారితో సులభంగా మాట్లాడగలిగే స్థాయిలో మాత్రమే మీ వర్కవుట్ వేగం ఉండాలి. శరీరాన్ని తీవ్రంగా అలసిపోయేలా చేయకూడదు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశాల్లో, సౌకర్యవంతమైన కాటన్ దుస్తులు ధరించి మాత్రమే వ్యాయామాలు చేయాలి.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.