1.4 కోట్ల మంది చిన్నారులకు ఒక్క టీకా కూడా అందలేదు: ఐరాస నివేదిక.. 

షేర్ చేయండి:
1.4 కోట్ల మంది చిన్నారులకు ఒక్క టీకా కూడా అందలేదు: ఐరాస నివేదిక.. 

సాక్షి లైఫ్ : 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14 మిలియన్ల (1.4 కోట్ల) మంది చిన్నారులకు కనీసం ఒక్క టీకా డోసు కూడా అందలేదని ఐక్యరాజ్యసమితి (UN) నివేదించింది. ఇది అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) యునిసెఫ్ (UNICEF) సంయుక్తంగా విడుదల చేసిన వార్షిక ప్రపంచ వ్యాక్సిన్ కవరేజ్ అంచనా నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

ఈ నివేదిక ప్రకారం, టీకాలు తీసుకున్నవారు సంఖ్య  కొద్దిగా మెరుగుపడినప్పటికీ, అంతర్జాతీయ నిధుల కోత కారణంగా ఎక్కువమంది పిల్లలకు టీకా అందించడం సవాలుగా మారిందని అధికారులు అంగీకరించారు.

మీజిల్స్ టీకా.. 

మీజిల్స్ (తట్టు) టీకా విషయంలో కొంత మెరుగుదల కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా 76 శాతం మంది పిల్లలు మీజిల్స్ టీకా రెండు మోతాదులను అందుకుంటున్నారని WHO అండ్ UNICEF తెలిపాయి.

ఇతర వ్యాక్సిన్ల విషయంలో..  

ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో దాదాపు 89 శాతం మంది 2024లో డిఫ్తీరియా, టెటనస్, కోరింత దగ్గు (డిటిపి) వ్యాక్సిన్ మొదటి మోతాదును పొందారని నివేదిక వెల్లడించింది,  గతేడాదితో పోలిస్తే 2023 సంవత్సరంలో కూడా ఆ సంఖ్య అదేవిధంగా ఉంది. పెద్దగా మార్పు లేదు. మూడు-డోస్ సిరీస్‌ను దాదాపు 85 శాతం మంది పూర్తి చేశారు, ఇది 2023లో 84 శాతంగా ఉంది.

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?  

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?  

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.