H1N2 Swine Flu : చైనాలో మనిషికి 'H1N2' స్వైన్ ఫ్లూ : H1N1తో పోలిస్తే ప్రాణాంతకమా..?
సాక్షి లైఫ్ : జంతువుల నుంచి మనుషులకు సోకే 'జూనోటిక్' (Zoonotic) వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మనుషుల్లో వచ్చే 60 శాతానికి పైగా వ్యాధులు జంతువుల నుంచి వ్యాపించేవే కావడం గమనార్హం. మనకు ఇప్పటికే H1N1 స్వైన్ ఫ్లూ గురించి తెలుసు. అయితే, తాజాగా చైనాలో తొలిసారిగా ఓ బాలుడికి ఇన్ఫ్లుయెంజా-ఎ (H1N2) వైరస్ సోకడం వైద్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసలు ఈ H1N2 వైరస్ ఏమిటి..? ఇది ఎంతవరకు ప్రమాదకరం..? తదితర వివరాలు తెలుసుకుందాం..
H1N2 వైరస్ అంటే ఏమిటి..? చైనా కేసు నేపథ్యంలో..
సాధారణంగా H1N2 అనేది పందులలో మాత్రమే కనిపించే ఒక అరుదైన ఇన్ఫ్లుయెంజా రకం. ఇది మనుషులకు సోకడం చాలా అరుదు. చైనాలో పందులు, కోళ్లు ఎక్కువగా పెంచే ప్రాంతంలో నివసిస్తున్న ఒక రెండేళ్ల బాలుడిలో ఈ ఇన్ఫెక్షన్ బయటపడింది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
లక్షణాలు..?
ఆ బాలుడికి పదే పదే జ్వరం రావడం, ఆగకుండా దగ్గు రావడం జరిగింది. పరిస్థితి విషమించి 'బ్రాంకోనిమోనియా'కు దారితీయడంతో ఆసుపత్రిలో చేర్పించారు.
కారణం..?
బాలుడు అనారోగ్యానికి గురైన సమయంలోనే వారి పరిసరాల్లో ఒక పంది చనిపోయింది. చనిపోయిన పందిలో, బాలుడిలో ఒకే రకమైన ఇన్ఫ్లుయెంజా-ఎ వైరస్ ఉన్నట్లు గుర్తించారు.
సకాలంలో చికిత్స అందించడంతో ఆ బాలుడు పూర్తిగా కోలు కున్నాడు. బాలుడితో కాంటాక్ట్ లో ఉన్న మరో 30 మందిని పరీక్షించగా ఎవరికీ ఈ వైరస్ సోకలేదని నిర్ధారణ అయింది. అంటే మనిషి నుంచి మనిషికి వ్యాపించే లక్షణం ప్రస్తుతానికి కనిపించలేదు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
