Strong Immunity : రోగనిరోధక శక్తికి బ్రహ్మాస్త్రం ఇవి.. మీ డైట్‌లో ఈ పోషకాలు ఉన్నాయా మరి..?
సాక్షి లైఫ్ : మన శరీరానికి వ్యాధి నిరోధక వ్యవస్థ (immune system) ఒక రక్షణ కవచం లాంటిది. ఇది మనల్ని అనేక రకాల అంటువ్యాధుల నుంచి కాపాడుతుంది. కరోనా మహమ్మారి తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడంపై అందరిలోనూ అవగాహన పెరిగింది. అయితే, కేవలం ఆరోగ్యకరమైన జీవనశైలి మాత్రమే కాదు, మనం తీసుకునే సమతుల్య ఆహారం కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇమ్యూనిటీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి విటమిన్ 'సి', 'డి' మాత్రమే. కానీ, సంపూర్ణ ఆరోగ్యానికి మరికొన్ని పోషకాలు కూడా శరీరానికి అత్యవసరం. అవేంటో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
విటమిన్-సి, డి (Vitamin C & D)..
విటమిన్-సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ధి చేసి, రోగకారక క్రిములతో సమర్థంగా పోరాడేలా చేస్తుంది. అలాగే విటమిన్-డి3 కూడా ఇమ్యూనిటీని మెరుగుపరచడంలో ఎంతో కీలకం. రోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాల పాటు లేత ఎండలో నిలబడటం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్-డి సహజంగా అందుతుంది. విటమిన్-సి, డి అధికంగా ఉండే సిట్రస్ జాతి పండ్లు, ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
విటమిన్-ఇ (Vitamin E)..
విటమిన్-సి, డి తరహాలోనే విటమిన్-ఇ కూడా శరీరంలో ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్. శరీరంలో జరిగే దాదాపు 200 జీవ రసాయన చర్యల్లో (Biochemical reactions) ఇది పాలుపంచుకుంటుంది. రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి, అలాగే కణాలు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్-ఇ ఎంతో అవసరం. బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్ ద్వారా దీన్ని పొందవచ్చు.
ప్రొటీన్ (Protein)..
అమైనో ఆమ్లాలతో (Amino acids) తయారయ్యే ప్రొటీన్లు రోగనిరోధక శక్తిని నిర్మించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి శరీరంలోని యాంటీబాడీలు, 'టీ-కణాలు', 'బీ-కణాలు' సూక్ష్మక్రిములతో పోరాడేలా ఉద్దీపన చేస్తాయి. ప్రొటీన్ లోపం ఉన్నవారిలో కండరాలు బలహీనపడటమే కాకుండా, ఇతరులతో పోలిస్తే వారు త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుంది. పప్పులు, గుడ్లు, మాంసం, పాలు వంటి వాటిల్లో ప్రొటీన్ పుష్కలంగా దొరుకుతుంది.
జింక్ (Zinc)..
బలమైన రోగనిరోధక వ్యవస్థకు జింక్ చాలా ముఖ్యం. ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో జింక్ లోపిస్తే తరచుగా జలుబు, ఫ్లూ, ఇతర వైరల్ జ్వరాలు దరిచేరుతాయి. ముఖ్యంగా వృద్ధులు జింక్ అధికంగా ఉండే ఆహారం లేదా వైద్యుల సలహాతో సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో అవసరం. రోజువారీ ఆహారంలో ఈ పోషకాలన్నీ సమపాళ్లలో ఉండేలా చూసుకుంటే.. రోగనిరోధక వ్యవస్థ బలపడి ఎటువంటి అనారోగ్యాలనైనా సులభంగా ఎదుర్కోగలుగుతుంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
