Asthma vs Bronchitis : ఉబ్బసం, బ్రాంకైటిస్..లక్షణాలు ఒకటే అయినా.. రెండింటి మధ్య తేడా ఏంటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శ్వాసకోశ సమస్యలు మనిషి జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వీటిలో ప్రధానమైనవి ఆస్తమా (asthma), బ్రాంకైటిస్. ఈ రెండింటిలోనూ దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. అయితే, ఇవి వచ్చే కారణాలు, చికిత్స విధానాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

 

ఆస్తమా (asthma) లక్షణాలు, కారణాలు..?

ఇది జన్యుపరమైన, వాతావరణ కారణాల కలయిక వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్య. వాతావరణంలోని అలర్జీ కారకాల వల్ల శ్వాసనాళాలు వాపునకు గురై కుంచించుకుపోతాయి.

కారణాలు..?

పుప్పొడి, ఇంట్లోని దుమ్ము, జంతువుల రోమాలు, సిగరెట్ పొగ, కాలుష్యం లాంటివి ఆస్తమాను ప్రేరేపిస్తాయి.

లక్షణాలు..? 

శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, శ్వాస వదులుతున్నప్పుడు పిల్లి కూతలు (Wheezing) లేదా గురక రావడం. ముఖ్యంగా ఉదయం, రాత్రి సమయాల్లో ఈ లక్షణాలు ఎక్కువగా బాధిస్తాయి. వ్యాయామం చేసినప్పుడు కూడా తీవ్రమవుతాయి.

బ్రాంకైటిస్ లక్షణాలు, కారణాలు..

ఇది ప్రధానంగా వైరస్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూకి కారణమయ్యే వైరస్‌లే బ్రాంకైటిస్‌కూ దారి తీస్తాయి. ఇది సాధారణంగా కొద్ది రోజుల పాటు ఉండే సమస్య.

కారణాలు..?

 వాతావరణ మార్పుల సమయంలో వచ్చే వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు.

లక్షణాలు..?

విడవకుండా దగ్గు రావడం, దగ్గినప్పుడు ఆకుపచ్చ, తెలుపు లేదా పసుపు రంగులో కఫం పడటం. ఛాతీలో నొప్పి, తలనొప్పి, చలి జ్వరం వంటివి కనిపిస్తాయి.

గుర్తించాల్సిన ప్రధాన అంశాలు..

కాలపరిమితి: బ్రాంకైటిస్ అనేది తాత్కాలికం. తగిన మందులు వాడితే తగ్గిపోతుంది. ఆస్తమా అనేది ఎప్పటికీ ఉండిపోయే దీర్ఘకాలిక సమస్య. ఆస్తమా ఉన్నవారికి బ్రాంకైటిస్ త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది. ఈ రెండు ఒకేసారి వస్తే దానిని 'క్రానిక్ ఆస్తమాటిక్ బ్రాంకైటిస్' అంటారు.

లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ, కారణాలు వేరు కాబట్టి.. సమస్య వచ్చిన వెంటనే సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి కచ్చితమైన వ్యాధి నిర్ధారణ (Diagnosis) చేయించుకోవడం ఎంతో అవసరం.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.