చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్..
సాక్షి లైఫ్ : చైనాలో కొత్త వైరస్ ఏదొక రూపంలో పుట్టుకొస్తూనే ఉంది. మరో కొత్త వైరస్, H3N2 , H10N5 బర్డ్ ఫ్లూ కారణంగా 63 ఏళ్ల మహిళ మరణించింది. మహిళతో కలిసి ఉన్న వ్యక్తులందరి రిపోర్టులు నెగిటివ్‌గా ఉన్నాయని, ఈ కొత్త వైరస్ కు సంబంధించి కేసులేమీ నమోదుకాలేదని చైనా పరిపాలన విభాగం అధికారులు వెల్లడించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ ప్రకారం H10N5 వైరస్ ఏవియన్ మూలానికి చెందినదని, మనుషులకు ప్రభావవంతంగా సోకే సామర్థ్యాన్ని కలిగి లేదని పరిశోధనలు చెబుతున్నాయి.
హెచ్3ఎన్2, హెచ్10ఎన్5 అనే బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా చైనాలో బుధవారం 63 ఏళ్ల మహిళ మరణించింది. అన్హుయ్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ అనారోగ్యం తీవ్రత కారణంగా డిసెంబర్ 16న మరణించినట్లు నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
