WHO Issues New Guidelines : మధుమేహం.. తల్లీబిడ్డలకు తీవ్ర ముప్పు..! డబ్ల్యూహెచ్‌ఓ కొత్త మార్గదర్శకాలు ఇవే..
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరు గర్భధారణల్లో ఒకరు హై బ్లడ్ షుగర్ (diabetes) సమస్యను ఎదుర్కొంటున్నారు. అంటే ఏటా సుమారు 2.1 కోట్ల మంది మహిళలు ఈ పరిస్థితి బారిన పడుతున్నారు. దశాబ్దాలుగా గర్భిణుల్లో వచ్చే మధుమేహానికి కూడా సాధారణ మధుమేహం మార్గదర్శకాలనే వైద్యులు పాటిస్తూ వచ్చారు. ఈ పరిస్థితిని మారుస్తూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తొలిసారిగా గర్భిణుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
డబ్ల్యూహెచ్‌ఓ (WHO) కొత్త మార్గదర్శకాలు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా గర్భధారణ సమయంలో మధుమేహం నిర్వహణ (Gestational Diabetes Management) కోసం ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించింది. వ్యాధి నిర్ధారణ నుంచి డెలివరీ వరకు ప్రతి దశను ఇందులో పొందుపరిచారు. సాధారణం కాదు..ఇకపై గర్భిణుల్లో వచ్చే మధుమేహాన్ని సాధారణ మధుమేహంగా పరిగణించి చికిత్స చేయరు. పేదలకు ప్రాధాన్యం..ముఖ్యంగా అల్పాదాయ, మధ్యతరగతి దేశాల్లోని పేద మహిళల ఆరోగ్యంపై ఈ మార్గదర్శకాలు ప్రత్యేక దృష్టి సారించాయి.
తేడా గుర్తింపు..
"గర్భధారణ సమయంలో కొత్తగా వచ్చిన మధుమేహం", "అప్పటికే ఉండి గర్భధారణ సమయంలో బయటపడిన మధుమేహం".. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా పరీక్షల ద్వారా తెలుసుకుని తగిన చికిత్సను సూచిస్తారు.
భారతదేశంలో ఈ సమస్య ఎందుకు ఎక్కువ..?
భారతదేశాన్ని ప్రపంచ "డయాబెటిస్ క్యాపిటల్" అని పిలుస్తుంటారు. అయితే, ఇక్కడ సాధారణ మధుమేహంపై ఉన్నంత అవగాహన గర్భకాల మధుమేహం (Gestational Diabetes Mellitus - GDM) పై లేదు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారతీయ మహిళల్లో ఈ సమస్య చాలా ఎక్కువ. దీనికి ప్రధాన కారణాలు..
జన్యుపరమైన కారణాలు...
పెరుగుతున్న ఊబకాయం.
పట్టణ జీవనశైలి కారణంగా శారీరక శ్రమ తగ్గిపోవడం.
గర్భం దాల్చక ముందు నుంచే మధుమేహం ఉండటం.. చాలామందికి ఈ విషయం పరీక్షలు చేసే వరకు తెలియదు.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే జరిగే నష్టాలు..
గర్భధారణ సమయంలో బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపు తప్పితే (hyperglycemia), దాన్ని ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు. ఇది ఎన్నో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది:
ప్రీ-ఎక్లాంప్సియా.. రక్తపోటు ప్రమాదకర స్థాయికి పెరగడం.
మృత శిశు జననం (స్టిల్‌బర్త్).. కడుపులోనే శిశువు ప్రాణాలు కోల్పోయే ముప్పు పెరుగుతుంది.
కష్టతరమైన డెలివరీ.. శిశువు సాధారణం కంటే పెద్ద పరిమాణంలో ఉండటం వల్ల ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. బిడ్డకు గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది.
డెలివరీ తర్వాత కూడా తప్పని ముప్పు..
మధుమేహం ప్రభావం ప్రసవంతోనే ముగిసిపోదు. దీని దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కూడా ఉంటాయి.
పుట్టిన కొన్ని గంటల్లోనే నవజాత శిశువు రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయికి పడిపోవచ్చు.
తల్లికి భవిష్యత్తులో టైప్-2 మధుమేహం (Type 2 Diabetes) వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది.
పుట్టిన పిల్లలకు సైతం భవిష్యత్తులో జీవక్రియ సంబంధిత (metabolic diseases) వ్యాధులు వచ్చే ముప్పు పొంచి ఉంటుంది.
గర్భధారణ సమయంలో చేయించుకునే గ్లూకోజ్ పరీక్షలను కేవలం ఒక లాంఛనంగా భావించి నిర్లక్ష్యం చేయవద్దు. అలాగని, గర్భంలో మధుమేహం వస్తే జీవితాంతం ఉంటుందని భయపడాల్సిన పనిలేదు. తల్లీబిడ్డల క్షేమం కోసం ప్రసవం జరిగిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
