H1N1 : ఢిల్లీని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ కేసులు..
సాక్షి లైఫ్ : దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో హెచ్1ఎన్1 (H1N1) (Swine Flu), ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వేగంగా ప్రబలుతున్నాయి. వాతావర ణంలో వస్తున్న మార్పుల కారణంగా వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కేసుల సంఖ్య భారీగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
కేసుల తీవ్రత, ప్రభుత్వ చర్యలు..
ఢిల్లీలో ఆగస్టు తొలి వారం నాటికి ఏకంగా 1,344 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయానికి కేవలం 229 కేసులు రాగా.. ముంబైలోనూ 309 కేసులు రికార్డయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.అత్యవసర చికిత్సకు అవసరమైన పడకలు, మందులు సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు.
హెచ్1ఎన్1 (Swine Flu) ప్రధాన లక్షణాలు..
సాధారణ ఫ్లూ లాగే అనిపించినా, దీని తీవ్రత ప్రాణాంతకం కావచ్చు. ఈ కింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి:
అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం 102 నుంచి 104 డిగ్రీల వరకు రావడం.
భరించలేని ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం.
పొడి దగ్గు, గొంతు నొప్పి,ముక్కు కారడం.
కొందరిలో కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు.
ఎవరికి ముప్పు ఎక్కువ..?
అందరిలోనూ ఈ వ్యాధి తీవ్రంగా మారకపోయినా..చిన్న పిల్లలు, వయోవృద్ధులు,గర్భిణీలు. ఆస్తమా, మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ముందు నుంచే ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
వైద్యుల సూచనలు,నివారణా చర్యలు ఏమిటి..?
స్వైన్ ఫ్లూ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని కనీస జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని ఇంటెన్సివ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. తరచుగా చేతులను సబ్బుతో లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
ఫ్లూ లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి. ముఖ్య గమనిక.. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, ఛాతీ నొప్పి, లేదా ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం గమనిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను హాస్పిటల్ కు తీసుకెళ్లాలి. సొంత వైద్యం కూడదు.
